Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఆదివాసి ఎరుకల అభివృద్ధి కోసం ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి, రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలనీ తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు డిమాండ్ చేశారు.
తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు కుతాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్ కోర్టు చౌరస్తాలోనీ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు హాజరై మాట్లాడుతూ..
తెలంగాణ వ్యాప్తంగా ఆదివాసి ఎరుకల ప్రజలు విద్యా ఉద్యోగాలు ఉపాధి అవకాశాలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
ఇతర గిరిజన తెగలతో పోల్చుకుంటే అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉన్నామని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మా తరఫున అసెంబ్లీలో గాని, శాసనసభలో గాని ఎరుకల సమస్యల మీద మాట్లాడేవాళ్లు లేకపోవడం వల్ల మా సమస్యలు ప్రభుత్వము దృష్టికి పోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఈ కింది డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా ఆదివాసి ఎరుకల అభివృద్ధి కోసం ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి 500 కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా పందులపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాల అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమును (YES) అమలు చేయాలని కోరుచున్నామన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా కనుమరుగై పోతున్న ఆదివాసి ఎరుకల కులవృత్తులు..ఎరుకల సోది, తట్టలు, బుట్టలు, గంపలు, పోనుకలు, చీపుర్లు ప్రోత్సాహం కింద బ్యాంకుతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షల ఏకలవ్య బంధువు ఇవ్వాలని కోరుతున్నామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా చదువుకున్న ఆదివాసి ఎరుకల విద్యార్థి – విద్యార్థులు ఇతర విద్యార్థి – విద్యార్థులతో పోటీ పరీక్షలలో అర్హత పొందడానికి హైదరాబాదు కేంద్రంగా ప్రత్యేక ఏకలవ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుచున్నామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీ ఎరుకల నిరుద్యోగ యువతీ యువకులకు గిరిజన సంక్షేమ శాఖ తో పాటు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఔట్ సోర్స్ ఉద్యోగాలు కల్పించాలని కోరారు.
విద్యారంగంలో వెనుకబడి పోతున్న ఆదివాసి ఎరుకల విద్యార్థి విద్యార్థుల కోసం ఏకలవ్య మోడల్ స్కూల్ లో గాని గురుకుల పాఠశాలలో ఆదివాసి ఎరుకల విద్యార్థి విద్యార్థులకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని కోరారు.
నేషనల్ ఎస్టీ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రత్యేక ఎస్టి కమిషన్ ఏర్పాటు చేసి ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఆదివాసి ఎరుకల సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని కోరుతున్నామన్నాడు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 ఎస్టి రిజర్వుడ్ MLA స్థానాలలో మరియు 2 పార్లమెంట్ స్థానాలలో లంబాడి, కోయ, గోండు తెగలు ఇప్పటికీ అవకాశాలు పొందుతూనే ఉన్నారనీ, కనీసం
ఆదివాసి ఎరుకల తెగను గుర్తించి అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ అవకాశాలు కల్పించాలని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోనేటి రాజు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు దుగ్యాల బాబు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు అంగిడి కుమారస్వామి, కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు కుతాడి కుమారస్వామి, కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు కుతాడి తిరుపతి, కట్ట రాజు బీజేపీ st సెల్ అధ్యక్షుల, కోశాధికారి మణుపాటి మల్లేషం, సహయ కార్యదర్శి కుతాడి కుమార్, పెద్దపల్లి జిల్లా నాయకులు మానుపాటి యల్లయ్య, మొగిలి, శ్రీనివాస్, జిల్లా నాయకులు కేంసారం రమేష్, కేంసారం సమ్మయ్య, కుతాడి పరశురామ్, కుతాడి ఎల్లయ్య, కుతాడి ఎల్లస్వామి, కేంసారం కనుకయ్య, మేరగుత్త నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు





