Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో ఓ దొంగతనం కేసులో నిందితునికి 22 నెలల జైలు శిక్ష రూ. 500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. దానికి సంబంధించి సీఐ, కోర్టు కానిస్టేబుల్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
తేదీ 14.12.2023 రోజున హుజురాబాద్ పట్టణం విద్యానగర్ కు చెందిన గూడ హరికృష్ణ ఇంటికి తాళం వేసి తన సొంత గ్రామామైన సైదాపూర్ మండలం బొమ్మకల్ వెళ్లినాడు. అనంతరం తేదీ 19.10.2023 రోజున ఉదయం 7 గంటలకు తన పనిమనిషి ఇంటిని శుభ్రం చేసేందుకు రాగా ఇంటి తలుపులు తెరిచి ఉన్నవి అని తన యజమాని హరికృష్ణకు తెలియజేయగా అతను వచ్చి చూసుకునేసరికి బీరువాలో ఉన్న 52 వేల రూపాయలు దొంగిలించుకుని పోయినారని గుర్తించి హుజురాబాద్ పోలీస్ స్టేషన్ కు వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అప్పటి సీఐ బొల్లం రమేష్ కేసు పరిశోధన చేసి నిందితున్ని (నేరస్తుడు) చిక్కుడు కృష్ణ దుబ్బాక, సిద్దిపేట జిల్లా పట్టుకొని కోర్టుకు పంపగా, హుజురాబాద్ కోర్ట్ కానిస్టేబుల్ మహమ్మద్ యూసుఫ్ కోర్టులో సాక్షులను ప్రాసిక్యూషన్ తరపున pp రమా ఉపేందర్ కేసును వాదించారు. కేసు రుజువు కావడంతో జడ్జి పద్మ సాయిశ్రీ నిందితునికి ఒక సంవత్సరం 10 నెలలు జైలు మరియు రూ.500 జరిమానాగా శిక్ష విధించినట్లు ప్రస్తుత టౌన్ సిఐ కరుణాకర్, కోర్టు కానిస్టేబుల్ యూసఫ్ లు తెలిపారు.






