
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో సోమవారం రాత్రి కొండచిలువల హల్చల్ చేశాయి. పట్టణంలో ఏదో ఓ చోట ప్రత్యక్షమవుతున్న కొండచిలువలతో పట్టణ ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా రాత్రి పట్టణంలోని జమ్మికుంట రోడ్డు మధ్యలో కొండచిలువను స్థానికులు గుర్తించారు. భారీగా జనం గుమిగూడడముతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పాములు పట్టే అఫ్జల్ ను పిలిపించి సంచిలో వేసి క్షేమంగా గుట్టల్లో వదిలేశారు.


జమ్మికుంట రోడ్డులో ప్రత్యక్షమైన కొండ చిలువ…

పట్టి సంచిలో వేసుకున్న అఫ్జల్…





