
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి (నల్లకుంట శంకరమఠం): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదేళ్ల పాలనలో సాధించిన విజయాలను విశ్లేషిస్తూ, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్‌రావు రచించిన “శ్రీ నరేంద్ర మోదీ – నిబద్ధ పరిపాలన దక్షుడు” అనే గ్రంథాన్ని నేడు నల్లకుంట శంకరమఠంలో శ్రీశృంగేరి శారదా పీఠాధిపతి శ్రీశ్రీ విద్యాశేఖర భారతీ స్వామిజీ వారే ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా స్వామిజీ, గ్రంథంలోని అంశాలపై రచయితతో సమగ్రంగా సంభాషించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం స్వామిజీ, రచయితను ఆశీర్వదించి, ప్రసాదంతో పాటుగా గోడ గడియారాన్ని బహుమతిగా అందజేశారు.
తరువాత మీడియాతో మాట్లాడిన డా. వకుళాభరణం ఇలా అన్నారు:
“మోదీజీ 75వ జన్మదినం సందర్భంగా గత సెప్టెంబర్ 17న నేను ఒక ప్రత్యేక వ్యాసావళి రచించి ఆవిష్కరించాను. కాగా ఇప్పుడు ఆయన పదేళ్ల పాలనలో సాధించిన విజయాలపై సమగ్ర అధ్యయనం చేసి ఈ గ్రంథాన్ని రచించాను. దేశానికే కాక, ప్రపంచానికి అందించిన ఆయన నాయకత్వాన్ని పత్రికా ఆధారాలతో అందరికీ చేరువ చేయడం నా లక్ష్యం.”


శ్రీ నరేంద్ర మోదీ – నిబద్ధ పరిపాలన దక్షుడు” పుస్తక ఆవిష్కరణ చేస్తున్న శ్రీశృంగేరి శారదా పీఠాధిపతి శ్రీశ్రీ విద్యాశేఖర భారతీ స్వామిజీ వారు….





