
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న గురుకుల విద్యార్థి శ్రీ వర్షిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని పలువురు ఎమ్మార్పీఎస్, బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామంలో శ్రీ వర్షిత కుటుంబాన్ని ఎమ్మార్పీఎస్, బి.ఎస్.పి నాయకులు వేర్వేరుగా పరామర్శించారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయకపోతే తాము అండగా ఉంటామని అన్నారు. న్యాయ పోరాటానికి తాము ముందుకు వస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో బి.ఎస్.పి జిల్లా ఇంచార్జ్ పల్లె ప్రశాంత్,
నాయకులు మారేపల్లి మొగిలయ్య , గిన్నారపు మహేందర్ , వేల్పుల మల్లేశం , మంద సమ్మయ్య రామ్ శ్రీనివాస్, కండె తిరుపతి తదితరులు పాల్గొన్నారు. అలాగే
– ఎంఎస్ పి జిల్లా అధ్యక్షులు తునికి వసంత్, మారపల్లి శ్రీనివాస్, అంబాల మధురయ్య, దేవునూరి రవీందర్, రాజు, రాజేష్, నాని మల్లన్న రొంటాల రాజుకుమార్, వడ్డేపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మార్పీఎస్ నాయకులు..

బి.ఎస్.పి నాయకులు





