
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ శనివారం కనుకయ్యకు బిజెపి నాయకులు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ…. తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారనీ,కోసిన పంటలు ఆర పోస్తే వర్షానికి కొట్టుకుపోయాయని చాలాచోట్ల తడిసి ముద్దయ్యాయని వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వినతి పత్రం అందజేస్తున్న బిజెపి నాయకులు, కార్యకర్తలు





