
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో హుజురాబాద్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రచారంలో పాల్గొంటున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ డివిజన్లో హుజురాబాద్ కు చెందిన జయన్న ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గుడిపాటి జయపాల్ రెడ్డి, సింగపూర్ గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యురాలు గుడిపాటి సరితతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కోసం ఇంటింటా ప్రచార నిర్వహిస్తున్నారు. స్థానిక కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వము చేపట్టిన, చేపడుతున్న అభివృద్ధినీ వివరిస్తున్నట్లు, అధిష్టానం సూచనల మేరకు తాము కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేస్తున్నట్లు జయపాల్ రెడ్డి తెలిపారు.


జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఇంటింటి ప్రచారము నిర్వహిస్తున్న గుడిపాటి జైపాల్ రెడ్డి సరిత తదితర నేతలు..





