
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
అగ్రవర్ణాల్లోని పేదల కోసం ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ ఈడ్డబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై రాజకీయ పబ్బం కోసం కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హైదరాబాద్ లో ఆదివారం ఓసి ఐకాస ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో పేర్కొన్నారు.
జాతీయ రాష్ట్రస్థాయిలో ఈడబ్ల్యూఎస్ కమిషన్ వేసి చట్టబద్దత కల్పించాలని, ఓసి లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను వర్తింప జేయాలని, ఓసి కార్పొరేషన్ లకు నిధులు కేటాయించి పాలక మండల్లు ఏర్పాటు చేయాలన్నారు. ఓసిలకు ఉపాద్యాయ అర్హత పరీక్ష టెట్ లో అర్హత మార్కులను 90 నుండి 75కు తగ్గించాలని, ఈడబ్ల్యూఎస్ కు కేటాయించి మిగిలిపోయిన పోస్టులను ఆ వర్గాలతోనే బ్యాక్ లాగ్ ద్వారా భర్తీ చేయాలని, అన్ని పోటీ పరీక్షలలో ఓసి లకు వయోపరిమితి సడలించాలన్నారు. విద్యా ఉద్యోగ అర్హత పరీక్షలకు ఫీజులు తగ్గించాలని, విద్యా, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ అర్హతకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను పటిష్టంగా అమలు చేయాలనే డిమాండ్లతో 4వ తేదీ మంగళవారం రోజున ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద తెలంగాణ రాష్ట్ర రెడ్ల సంఘాల నిరసన దీక్షకు అన్నీ ఓసి సామాజిక వర్గీయులు భారీగా తరలి వచ్చి విజయవంతం చేయాలని పొలాడి రామారావు పిలుపు నిచ్చారు. ఈ ధర్ణాలో తమ ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర జిల్లాల నాయకులతో పాటు తాను సంఘీభావంగా పాల్గొంటున్నట్లు పోలాడి రామారావు ప్రకటించారు.
అంతకు ముందు నగరం లోని హరీశ్ రావు నివాసంలో ఇటీవలే మరణించిన మాజీ మంత్రి హరీశ్ తండ్రి సత్యనారాయణరావు చిత్ర పటానికి నాయకుల తో పుష్భాభిషేకం చేసి హరీశ్ రావు ను వారి కుటుంబ సభ్యులను పోలాడి రామారావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.


విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జాతీయ నాయకుడు పోరాడి రామారావు..






