
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :
ఇటీవల జరిగిన నవోదయ గురుకుల పాఠశాల ఎంట్రన్స్ పరీక్షలో హుజురాబాద్ మండలం జూపాక గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని పిండి హరిణి రాష్ట్రస్థాయిలో నాలుగవ ర్యాంకు సాధించినట్లు పాఠశాల హెచ్ఎం గుడిపాటి సవిత తెలిపారు. ర్యాంకులు కోచింగ్ వెళ్లిన వారికి పట్టణంలో చదువుకున్న వారికి వస్తాయన్న అపోహ ప్రజల్లో ఉందని కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ గ్రామీణ ప్రాంతంలో ఉన్నప్పటికీ హరిణి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఎంట్రన్స్ లో 95 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో నాలుగవ స్థానం పొందింది. హరిణి ర్యాంకు పొందడం పట్ల గ్రామ సర్పంచ్ తాళ్లపల్లి స్వప్న, ఉపాధ్యాయులు ప్రసన్న లక్ష్మి లు హర్షం వ్యక్తం చేశారు.




