
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈరోజు ప్రకటించిన తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో మార్కులు పట్టణంలోని కాకతీయ కళాశాల విద్యార్థులు సాధించారు.
ద్వితీయ సంవత్సర ఫలితాలలో BiPC విభాగంలో 1000 మార్కులకు గాను 995 మార్కులతో ఎస్ నాగ విశిష్ట ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే 994 మార్కులతో ఏ వైష్ణవి ద్వితీయ స్థానంలో నిలిచారు.
MPC ద్వితీయ సంవత్సరంలో 1000 మార్కులకు గాను 994 మార్కులతో ఎస్ సంజన ప్రధమ స్థానం, 993 మార్కులతో కే నీతు, పి సహస్ర ద్వితీయ స్థానంలో నిలిచారు. CEC ద్వితీయ సంవత్సరంలో 1000 మార్కులకు గాను 989 మార్కులతో ఎన్ గోమతి ప్రథమ స్థానంలో నిలిచారు.
అలాగే ప్రథమ సంవత్సరం ఫలితాలలో MPC విభాగంలో 470 మార్కులకు గాను 468 మార్కులతో ఎన్ మనుశ్రీ, రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం, BiPC విభాగలో 440 మార్కులకు 434 మార్కులతో కే శ్రీజ సాయి ప్రథమ స్థానం. అలాగే CEC విభాగంలో 500 మార్కులకు గాను 485 మార్కులతో సిద్ర ఇషాద్ ప్రథమ స్థానంలో నిలిచారు.
ఇంతటి విజయం సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ ఏం వేణుమాధవ్, డైరెక్టర్లు సిహెచ్. రాజేశ్వర్ రెడ్డి, కే తిరుపతి రెడ్డి, కే ప్రవీణ్ రెడ్డి, జే ప్రకాశ్ రెడ్డి, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు అభినందించారు.







