
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ లోని శ్రీవాగ్దేవి డిగ్రీ కళాశాల ఫైనల్ ఇయర్స్ విద్యార్థులకు ఈ రోజు హుజురాబాద్ సాయిరూప ఫంక్షన్ హాల్ లో వీడ్కోలు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలకు కళాశాల కరెస్పాండంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని విద్యార్థులు వారి కమ్యూనికేషన్ స్కిల్స్ ని పెంపొందించుకొని మంచి ఉద్యోగo సంపాదించుకొని వారి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలనీ చెప్పారు. అలాగే కళాశాల ప్రిన్సిపాల్ బొక్కల ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి ప్రభుత్వం నుండి ఫీ రెంబుర్స్మెంట్ రాకున్నా విద్యార్థులనుండి ఎటువంటి ఫీజు తీసుకోకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్యానందిస్తున్న ఏకైక కళాశాల శ్రీవాగ్దేవి కళాశాల అన్నారు. కావున విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తిరులై జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడాలన్నారు, తరువాత కళాశాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందించారు. చివరగా విద్యార్థుల నృత్యాలతో ఘనంగా తృతీయ సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులతో పాటు అధ్యాపకులు కొలిపాక రమేష్, రామరాపు భద్రయ్య, వేముల శ్రీనివాస్, చందా వెంకటేష్, సురేష్, మేకల నవీన్ కుమార్, శ్రీనివాస్, స్వప్న, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు..







