
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం సింగాపురం గ్రామంలోని విఎస్ఆర్ డీగ్రీ కళాశాలలో ఘనంగా కల్చరల్ పెస్ట్ వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ప్రధానంగా సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యం మరియు సంగీత ప్రదర్శనలు ప్రదర్శించారు.


విద్యార్థులకు పురస్కార ప్రదానోత్సవాలు అందజేస్తున్న ప్రిన్సిపల్..
అతిథి ప్రసంగాలు అనంతరం ప్రతిభావంతులైన విద్యార్థులకు పురస్కార ప్రదానోత్సవాలు అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో ఒత్తిడిని తగ్గించడం, ప్రతిభను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం మరియు స్నేహభావాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని ప్రముఖులు తెలియజేశారు. వీటి ముఖ్య ఉద్దేశ్యం సమాజ స్ఫూర్తిని పెంపొందించడం, విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా వారి ప్రతిభ కలిగిన విద్యార్థులు విద్యలో, క్రీడలలో, ఉద్యోగ రంగంలో సృజనాత్మకంగా, సమర్థవంతంగా మెరుగుపరుస్తారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ప్రిన్సిపాల్ తాళ్లపెల్లి అజయ్ కుమార్, సీనియర్ అధ్యాపకులు పాల్గొన్నారు.


అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ముఖ్యఅతిథి ప్రిన్సిపల్ అజయ్ కుమార్..





