
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, నవంబర్03:
బాల బాలికల అండర్ 14, అండర్ 17 హాకీ సెలక్షన్స్ ను కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని స్థానిక హాకీ క్రీడామైదానంలో జిల్లా సెక్రెటరీ వేణుగోపాల్, హుజురాబాద్ హాకీ క్లబ్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, ఎంఈఓ బి శ్రీనివాస్ తో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా సెక్రెటరీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. సుమారుగా ఉమ్మడి జిల్లాలో 170 మంది క్రీడాకారులు పాల్గొనగా అందులోనుండి అండర్ 17, అండర్ 14 బాల బాలిక జిల్లా జట్లను ఎంపిక చేశారు. ఎంపికైన వారు వనపర్తి లో జరిగే రాష్ట్ర స్థాయి హాకీ టోర్నమెంట్లో పాల్గొన్నట్లు తెలిపారు. గత సంవత్సరం అండర్ 14 హుజురాబాద్ లో నిర్వహించగా అండర్ 14 బాలికల జట్టు గోల్డ్ మెడల్ సాధించిందని గుర్తు చేశారు. అదేవిధంగా ఎంపికైన క్రీడాకారులు జిల్లాకి గోల్డ్ మెడల్ తీసుకురావడానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా హాకీ ఎస్ జి ఎఫ్ కన్వీనర్ వేముల రవికుమార్, వీటిలో సత్యానంద్, శ్రీనివాస్, భాగ్యలక్ష్మి, ఎస్ అనిల్, శేఖర్ హుజురాబాద్ మాజీ క్లబ్ అధ్యక్షుడు కొల్లిపాక శ్రీనివాస్, హుజురాబాద్ క్లబ్ సెక్రటరీ బోడిగే తిరుపతి, మాజీ కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్, సీనియర్ క్రీడాకారులు శ్యాంసుందర్, శంకర్ సజ్జు సాయి కృష్ణ, రాజేష్, విక్రమ్, సాంబ, వంశీ, పరబ్రహ్మంతో పాటు తదితరులు పాల్గొన్నారు.



క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్నా అతిథులు..

క్రీడాకారుల ఎంపికకు హాజరైన హాకీ క్రీడాకారులతో అతిధులు..





