
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన ఇమ్మడి సదానందం అనే రైతు అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి సోమవారం ఆత్మహత్య యత్నం చేశాడు. వెంటనే గమనించిన స్థానికులు 108 వాహనంలో హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు. బాధితునికి 20 గుంటల పొలం ఉండగా అప్పు సప్పు చేసి ఇటీవల ఇల్లు పనులు మొదలు పెట్టుకోగా సగములోనే డబ్బులు లేక ఆగిపోయింది. దీనికి తోడు పొలానికి సైతం అప్పు చేయడంతో అప్పులు మరింతగా పెరిగిపోయాయి. తీసుకున్న డబ్బులు ఇవ్వాలని పలువురు అడగడంతో కలత చెందిన సదానందం పొలానికి వాడే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య యత్నం చేసుకున్నాడని భార్య రాధ, బంధువులు తెలిపారు.

108లో బాధితుల సదానందమును ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం..

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇమ్మడి సదానందం





