
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట): జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన అంబాల ప్రభాకర్ (ప్రభు) జమ్మికుంట పట్టణ కేంద్రంలో గత రెండు దశాబ్దాల కాలంగా ఆర్టిస్ట్ గా ఉంటూ తనకు వచ్చిన డబ్బులో నుండి సమాజ సేవ చేస్తూ సామాజిక కార్యకర్తగా అనేక సేవా కార్యక్రమాలను గుర్తించిన ఏషియా ఇంటర్నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు ఇటీవల తమిళనాడు రాష్ట్రంలోని హోసూర్ నగరంలో అంబాల ప్రభాకర్ (ప్రభు) సామాజిక సేవ రంగంలో గౌరవ డాక్టరేట్ అవార్డులను అందుకున్న సందర్భంగా తన స్వగృహంలో అంతర్జాతీయ క్రీడాకారులు, ప్రభుత్వ ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ క్రీడాకారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు రఘు మాట్లాడుతూ..కుల, మత పేద, ధనిక తేడా లేకుండా ప్రజలందరితో మమేకంగా ఉంటూ సామాజిక సేవారంగంలో గత 20 సంవత్సరాలుగా అనేక కుటుంబాలకు వివిధ రకాల సేవా కార్యక్రమాలలో పాల్గొని వందలాది నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలను విద్యా, వైద్య, సేవా పరంగా ఆదుకున్నారన్నారు, క్రీడా రంగంలో తన అందరికి ఆదర్శం అని అన్నారు.
ఈ సామాజిక సేవ చేయడం వలన ఏషియా ఇంటర్నేషనల్ రీసర్చ్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం ఆయనకే కాకుండా మాలాంటి క్రీడాకారులకు గర్వకారణమని అన్నారు.
అదేవిధంగా గౌరవ డాక్టరేట్ పొందడం అంటే సమాజానికి మరింత సేవ చేసే బాధ్యతను పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో కలలా ముత్యంరెడ్డి, బిజిగిరి హరికృష్ణ, శనిగరం రాజు తదితరులు పాల్గొన్నారు.


డాక్టరేట్ అవార్డు పొందిన ప్రభును ఘనంగా సన్మానిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు.





