
– జనవరి నెలలఓసి జేఏసీ ఆధ్వర్యంలో లక్ష మంది ఓసి సామాజిక వర్గీయులతో వరంగల్ లో రాష్ట్ర స్థాయి ఓసి సింహగర్జన సమరభేరి ఓసి ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై అసత్య ప్రచారాలు, చేస్తున్న కుట్రలను సాగనివ్వబోమని దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెడ్డి ఓసి ఐకాస రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు జాతీయ ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయాలని, ఉపాద్యాయ అర్హత టెట్ లో ఓసిలకు అర్హత మార్కులను 90 నుంచి 75 కు తగ్గించాలని, ఓసిలకు కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలను వర్తింప జీయాలని, అన్నీ పోటీ పరీక్షలలో వయోపరిమితి సడలించాలని, రెడ్డి కార్పొరేషన్ కు నిధులు కేటాయించి పాలక మండలి ఏర్పాటు చేయాలనే తదితర దిమాండ్లతో రాష్ట్ర రెడ్డి, ఓసి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద గల ధర్నా చౌక్ లో నిరసన దీక్ష చేపట్టి ధర్నా నిర్వహించారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి రెడ్డి, ఓసి సామాజిక రాష్ట్ర జిల్లాల నాయకులు భారీ సంఖ్యలోతరలి వచ్చారు. ఈ సందర్భంగా ఐకాస రాష్ట్ర నాయకులు గోప్ జైపాల్ రెడ్డి, బుట్టమ్ మాధవ రెడ్డి, అప్పమ్మగారి రాంరెడ్డి, ఏనుగు సంతోష్ రెడ్డి, పిట్టా శ్రీనివాస్ రెడ్డి, బద్దూరి కొలను వెంకటేశ్వర్ రెడ్డి, నల్ల సంజీవ్ రెడ్డి, శశిధర్ రెడ్డి, పెండ్యాల రాంరెడ్డి, జున్నూతుల రాజిరెడ్డి, మధుకర్ రెడ్డిలు మాట్లాడుతూ రాజ్యాంగ సవరణ ద్వారా ఓసి పేదలకు కేంద్రం కల్పించిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు పర్చడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని దీంతో అర్హులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు చట్ట బద్దత గల ప్రత్యేక ఈడబ్ల్యూఎస్ జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. ఓసి లను విస్మరిస్తే ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
ఓసి ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు మాట్లాడుతూ తాము ఎవరికీ ఏ ఇతర వర్గాల రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని అన్ని వర్గాల పేదలకు సమన్యాయం జరగాలన్నదే తమ ధ్యేయమని అన్నారు. దామాషా జనాభా ప్రకారం ఓసి లకు స్ధానిక సంస్థల ఎన్నికల్లో తో సహా అన్ని రంగాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై రాజకీయ పబ్బం కోసం ఓటు బ్యాంక్ రాజకీయాలతో కొన్ని దుష్ట శక్తులు ఆయా కులాల్లోని ప్రజలను మభ్య పెట్టి తప్పు దోవ పట్టిస్తున్నారని ఈ కుట్రలను తిప్పి కొట్టదానికీ వచ్చే జనవరి నెలలో లక్ష మంది ఓసి సామాజిక వర్గీయులతో వరంగల్ లో రాష్ట్ర స్థాయి ఓసి సింహగర్జన సమరభేరి సభను నిర్వహిస్తున్నట్లు దీక్షకు సంఘీభావం తెలిపిన ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు వెల్లడించారు.





ఇందిరాపార్కు వద్ద గల ధర్నా చౌక్ లో నిరసన దీక్ష చేపట్టి ధర్నా నిర్వహిస్తున్న రెడ్డి, ఓసీ సంఘాల ఐకాస నాయకులు





