
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
కార్తీక మాసంలో పౌర్ణమి రోజున వచ్చే కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం హుజురాబాద్ ప్రాంతంలోని భక్తులు పండుగ వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కార్తీక పౌర్ణమి పండుగ రోజు జరుపుకునే పూజల కోసం మార్కెట్లో ప్రజలు ఉసిరి కొమ్మ, ప్రమిదలు పూలు పండ్లు కొనుగోలు చేశారు. కార్తీక పౌర్ణమినీ పురస్కరించుకొని ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకుని ప్రత్యేకంగా అలంకరించిన తులసి కోట వద్ద రాధాకృష్ణుల విగ్రహాన్ని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉసిరి కొమ్మలను ఉంచి ప్రార్థించారు. కృష్ణునికి ఇష్టమైన తులసి చెట్టు వద్ద పూజలు నిర్వహిస్తే భగవంతుడు తమ కోరిన కోర్కెలు తీర్చుతాడని నమ్మకం ప్రజల్లో ఉంది. తులసి కోట వద్ద పూజలు అనంతరం మంగళహారతులు ఇచ్చి వత్తులను కాల్చారు. పూజల అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి టపాకాయలు కాల్చారు. దేవాలయాలకు వెళ్లి తమ కుటుంబాలను చక్కగా చూడాలని పూజలు నిర్వహించారు. దేవాలయాల వద్ద భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.
పాటిమీద ఆంజనేయ స్వామి దేవాలయంలో…
పాటిమీద ఆంజనేయ స్వామి సహిత సరస్వతి మాత ఆలయంలో ఈరోజు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని సమూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు తిరుమల్ అయ్యాగారి అధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో లలిత్ అయ్యాగారు, ప్రదీప్ అయ్యాగగారు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, ,అలయ చైర్మన్ గందె శ్రీనివాస్, పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షుడు సుద్దాల హరి శంకర్ దంపతులు తదితరులు పాల్గొన్నారు.
సంతోషిమాత సహిత అయ్యప్ప స్వామి దేవాలయంలో…
హుజురాబాద్ పట్టణంలోని శ్రీ సంతోషిమాత నవగ్రహ సహిత అయ్యప్ప స్వామి దేవాలయంలో సామూహిక శ్రీ సత్యనారాయణ వ్రతంలు అంగరంగ వైభోగంగా జరుపుకున్నారు. ప్రముఖ వేద పండితుడు సిద్ధాంతి గూడా జగదీశ్వర శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలలో సుమారు 150 మంది దంపతుల భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ కమిటీ నాయకులు, ఆలయ ప్రధాన పూజారులు, అయ్యప్ప భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. అనంతరం సామూహిక అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే మండలంలోని బోర్నపల్లి గ్రామం, సిరిసపల్లి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంల వద్ద, పెద్దపాపయ్యపల్లి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర భక్తాంజనేయస్వామి దేవాలయం వద్ద సామూహిక సత్యనారాయణ వ్రతాలు కన్నుల పండుగ నిర్వహించారు.

పాటిమీది హనుమాన్ దేవాలయం వద్ద సత్యనారాయణస్వామి వ్రతంలో కూర్చున్న మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులు గందె రాధిక శ్రీనివాస్…

సత్యనారాయణస్వామి వ్రతాలలో పాల్గొన్న భక్తులు..

అయ్యప్పస్వామి దేవాలయంలో మూలవిరాట్ను అందంగా అలంకరించిన దృశ్యం.


అయ్యప్పస్వామి దేవాలయం వద్ద సామూహిక సత్యనారాయణ వ్రతంలో పాల్గొన్న భక్తులు..

సంతోషీమాత ఆలయం ముందు దీపాలు వెలిగిస్తున్న మహిళలు


సిరసపల్లి శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం వద్ద సామూహిక సత్యనారాయణ వ్రతాలలో పాల్గొన్న భక్తులు..

అయ్యప్పస్వామి దేవాలయం వద్ద పేద పండితుడు గూడ జగదీశ్వరశర్మను సత్కరిస్తున్న ఆలయ నిర్వాహకులు..

తులసి మాత వద్ద దీపాలు వెలిగించి పూజలు చేస్తున్న మహిళా భక్తులు..





