
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, డీసీఎంఎస్ మాజీ ఉపాధ్యక్షుడు, శంకరపట్నం మండల తాడికల్ సహకార సంఘం అధ్యక్షుడు కీ. శే. కలకుంట్ల హన్మంతరావు సామాన్యులకు, రైతులకు చేసిన సేవలు చిరస్మరణీయమని మాజీ ఎంఎల్ సి సంతోష్ కుమార్, రైతు ప్రజాసంఘాల జేఏసీ నాయకుడు పోలాడి రామారావు పేర్కొన్నారు.
కీ. శే. కలకుంట్ల హన్మంతరావు ప్రథమ వర్థంతి సందర్భంగా కరీంనగర్ లోని వారి నివాసంలో వారి కుటుంబ సభ్యులు నిర్వహించిన కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులు పలువురు భాయిసాబ్ అభిమానులు హాజరై ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి హన్మంతరావు చేసిన సేవలు స్మరించుకున్నారు. తన వద్దకు వచ్చిన వారికి కాదనకుండా సహాయ సహకారాలు అందించి అజాత శత్రువుగా పేరుగాంచిన భాయి సాబ్ గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పేరొందినారని పలువురు గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్ సి సంతోష్ కుమార్, పోలాడి రామారావు, ఎంఐఎం నాయకుడు వహాజిద్దీన్, మాజీ కౌన్సిలర్ తిరుపతిగౌడ్, దామోదర్, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయన అభిమానులు, స్వగ్రామమైన శంకరపట్నం మండలంలోని ఏరడ పల్లి గ్రామస్తులు, రైతులు తదితరులు ఫ్పాల్గొన్నారు.

హనుమంతరావు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, జాతీయ నాయకుడు రామారావు తదితరులు..





