
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట): పోలీసులంటే కర్కషం లేకుండా కఠినంగా ఉంటారన్న అపవాదు ఉండగా దానికి భిన్నంగా పోలీసులు అంటే సేవా తత్పరులని ఓ పోలీస్ అధికారి నిరూపించారు, దానికి ఉదాహరణ ఈ సంఘటన. జమ్మికుంట మండలానికి చెందిన రాజేందర్ అనే రైతు తను ఆరు గాలం కష్టపడి ధాన్యాన్ని పండించి మార్కెట్ కు తరలిస్తున్న తరుణంలో టాక్టర్ అదుపుతప్పి జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్ పైన బస్తాలు జారీ కింద పడిపోయాయి.
దిక్కు తోచని స్థితిలో ఉన్న రైతు సమాచారం అందుకున్న జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణగౌడ్ తక్షణమే స్పందించి పోలీస్ సిబ్బందిని ఘటన స్థలానికి పంపించారు. నిమిషాల్లో అక్కడికి చేరుకున్న ఎస్ఐ సతీష్ తనే స్వయంగా వడ్ల బస్తాలు మోస్తూ టాక్టర్ పై ఎక్కించారు. ఆపద కాలంలో రైతుకు సహాయం చేసిన జమ్మికుంట ఎస్సై సతీష్ ను దారివెంట వెళుతున్న పలువురు శభాష్ పోలీస్ అని మెచ్చుకున్నారు.





రోడ్డుపై పడిపోయిన ధాన్యం బస్తాలను తిరిగి సంచిలో నింపి స్వయంగా ట్రాక్టర్లోకి ఎక్కిస్తున్న ఎస్ఐ సతీష్, పోలీసు సిబ్బంది..





