
మండల యాదగిరి,స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విద్యాసంస్థల్లో జరుగుతున్న వందేమాతరం గీతం సంబంధిత కార్యక్రమాల స్ఫూర్తితో, హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని నాగార్జున మిల్క్ ప్రొడక్ట్స్ డైరీ ఆవరణలో శుక్రవారం వందేమాతరం గీతాలాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
భారతదేశ సమైక్యత, సౌభ్రాతృత్వం, ఐక్యతను చాటిచెప్పే దిశగా 1875 నవంబర్ 7న (నేటికీ దాదాపు 150 సంవత్సరాల సందర్భంగా) బంకించంద్ర చటర్జీ తన బెంగాలీ నవల ‘ఆనంద్ మఠం’లో ఈ గీతాన్ని రచించారు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని, డైరీ సిబ్బందిలో దేశభక్తిని, “మేమంతా భారతీయులం” అనే స్ఫూర్తిని పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మేనేజింగ్ డైరెక్టర్ పుల్లూరి ప్రభాకర్ రావు, డైరెక్టర్ పుల్లూరి గణేష్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డైరీ సిబ్బంది భారతమాత మురిసిపోయేలా వందేమాతరం గీతాన్ని ఉద్వేగభరితంగా ఆలపించారు. అనంతరం ఉద్యోగులంతా ఏకకంఠంతో “వందేమాతరం.. వందేమాతరం!” అంటూ నినాదాలు చేశారు.
ఈ దేశభక్తి స్ఫూర్తి కార్యక్రమ విజయంలో సీఈవో కృష్ణ ప్రసాద్, ఏజీఎం ఆకునూరి సుధాకర్ (ప్రొక్యూర్మెంట్), ఏజీఎం వెంకటస్వామి (ప్రొక్యూర్మెంట్), ప్లాంట్ మేనేజర్ మాటూరు శ్రీనివాస్, బ్యూటీ బి శ్రీనివాస్, మెయింటెనెన్స్ మేనేజర్ పి సంతోష్ తో పాటు వివిధ విభాగాల ఇన్చార్జీలు, డైరీ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


వందేమాతరం గీతాలాపన చేసి జాతీయ జెండాలు చేత భూనీ నినాదాలు చేస్తున్న నాగార్జున డైరీ డైరెక్టర్ గణేష్ రావ్, ఉద్యోగులు, సిబ్బంది.






