Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
వందేమాతర గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ నెల 13న హుజురాబాద్ లో సామూహిక వందేమాతర గీతాలాపన కార్యక్రమం జరగనున్నట్లు బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు తెలిపారు. ఆదివారం ఆయన హుజురాబాద్ లో మాట్లాడుతూ…వందేమాతరం ఒక మంత్రం ఒక శక్తి, ఒక స్వప్నం, ఒక సంకల్పం అని అది ప్రజల్లో స్వాతంత్ర కాంక్ష పెంపొందించింది అన్నారు. బకిన్ చంద్ర చటర్జీ రచించిన జాతీయ గేయానికి 150 ఏళ్లు పూర్తయినందున దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం ఉత్సవాలు నిర్వహిస్తుందనీ, భారత స్వాతంత్ర్య సమరానికి వందేమాతరం బలమైన గళంగా నిలిచిందన్నారు. వందేమాతర గేయం తల్లిగా అభివర్ణిస్తుందన్నారు. వందేమాతర గేయం రచించిన సమయానికి పరాయి పాలనలో మగ్గుతున్నామని, భారతదేశము ఎప్పటికైనా పునర్వైభవం సాధించాలని బతించంద్ర చటర్జీ కలలుగన్నారని అన్నారు. ఈ నెల 13 గురువారం హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో వందేమాతర గీతాలపన కార్యక్రమం చేపడుతున్నందున ప్రజాసంఘాలు, ప్రజా ప్రతినిధులు వివిధ పాఠశాల విద్యార్థులు అధ్యాపకులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు యువత ప్రజలు, ప్రజలంతా కార్యక్రమంలో పాల్గొని దేశభక్తిని చాటాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, సీనియర్ నాయకులు తిప్పబత్తిని రాజు, అంకతి వాసు, గంట సంపత్, కొడిమ్యాల పవన్ కుమార్, కొలిపాక వెంకటేష్, భాస్కర్ యాదవ్, క్యాస వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.






