
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
కవి ,రచయిత, గాయకుడు, నంది అవార్డు గ్రహీత అందెశ్రీ అనారోగ్యంతో మృతి చెందడం పట్ల సోమవారం హుజురాబాద్ పట్టణంలో పలువురు ప్రజాసంఘాల నాయకులు, తెలంగాణ ప్రాంత కళాకారుల జేఏసీ ఆధ్వర్యంలో వేరువేరుగా నివాళులర్పించి, సంతాపం వ్యక్తం చేశారు.
స్థానిక హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రముఖ రచయిత అందెశ్రీ చిత్రపటానికి పూలమాలవేసి క్రోవత్తులతో ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం అనే పాట పాడుతూ ఉర్రూతలూగించి తెలంగాణ ఉద్యమంలో తన పాటల ద్వారా ప్రత్యేక రాష్ట్రం కొరకు రచించిన పాటలు పాడుతూ తనను స్మరించుకుని ప్రముఖ రచయిత అందెశ్రీ (64) కన్నుమూయడం జరిగింది. ఉదయం ఇంట్లో కుప్పకూలిన అందెశ్రీనీ గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్సపొందుతూ మృతి చెందారు.
1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారాయన.
జయ జయహే తెలంగాణ గీతం రచించిన అందెశ్రీ
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. అందెశ్రీ కీ
ఇటీవల రూ.కోటి పురస్కారామ్ ప్రభుత్వం అందించింది.
అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య కాగా కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు.
అశువు కవిత్వం చెప్పడంలో అందెశ్రీ దిట్ట 2006లో గంగ సినిమాకు అందెశ్రీకి నంది పురస్కారం రాగా
అందెశ్రీకి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
2014లో అకాడమిఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్
2015లో దాశరథి సాహితీ పురస్కారం అందుకున్న అందెశ్రీ
2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం
2022లో అందెశ్రీకి జానకమ్మ జాతీయ పురస్కారం
2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం
లోక్ నాయక్ పురస్కారం అందుకున్న అందెశ్రీ
ఉదయం 7:25కి అందెశ్రీ మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. ఆయన మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత కళాకారుల జేఏసీ హుజురాబాద్ ఆవునూరు సుధాకర్, సీనియర్ కళాకారుడు
వడ్లకొండ అనిల్ కుమార్, శనిగరపు బాబ్జి, చొల్లేటి రాజన్న, డాక్టర్ విష్ణు దాసు గోపాలరావు, రావుల తిరుపతి, సంధ్యల వెంకన్న, ఎర్ర సురేష్ కీప్యాడ్, రావుల సాయికుమార్, కడారి రాజకుమార్, దాసరపు కుమార్, ఎండి చౌకత్ పాషా, మోరే సందీప్, సంపత్, ఆకినపెళ్లి సురేష్, మేకల నవీన్, బైరి అగ్నితేజ్ లతో పాటు ప్రజా సంఘాల ఉద్యమ నాయకులు భీమోజి సదానందం, పొడిశెట్టి వెంకటరాజ్యం, మట్టెడ ప్రకాష్, కట్కూరి రాజేందర్ ఇంటలెక్చువల్ సంద్యల వెంకన్నలు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. అలాగే
ఉదయం హై స్కూల్ క్రీడామైదానంలో దళిత ప్రజాసంఘాల నాయకులు ఆయన మృతి పట్ల మౌనం పాటించారు. తన పాటల ద్వారా అందే శ్రీ తెలంగాణ ఉద్యమానికి, సమాజానికి చేసిన సేవలను ప్రజల్లో ఆయన నెలకొల్పిన చైతన్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు
వేల్పుల రత్నం, ఎడ్ల విజయకుమార్, సాదుల రవీందర్, బండ కిషన్, వేల్పుల ప్రభాకర్, సదానందం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.



హై స్కూల్ క్రీడా మైదానంలో అందెశ్రీకి నివాళులర్పిస్తున్న దళిత, ప్రజాసంఘాల నాయకులు..





