
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో తెలియదు కానీ దర్జాగా ద్విచక్ర వాహనాన్ని పట్టపగలు చోరీ చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని సూపర్ బజార్ రోడ్డులో గల సంజీవని మెడికల్ షాప్ ముందు నిరూపించిన ఓ ద్విచక్ర వాహనాన్ని ఓ దొంగ యదేచ్చగా చోరీ చేశారు. గురువారం రోజు సాయంత్రం నాలుగు గంటల 16 నిమిషాలకు సూపర్ బజార్ లోని సంజీవిని మెడికల్ షాప్ ముందు మండలంలోని పెద్ద పాపయ్యపల్లి గ్రామానికి చెందిన తలకొక్కుల నరసయ్య తన టీవీఎస్ ఎక్సెల్ బండి పెట్టి మెడికల్ షాపుల్లోపలికి వెళ్లి వచ్చేసరికి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి బండిని దొంగిలించి తీసుకువెళ్లాడు. అయితే ఆ బండికి ఉన్న సంచిలో ఎంతో విలువైన ఒరిజినల్ పెన్షన్ కాగితాలు మరియు ఆధార్ కార్డ్ తదితర ముఖ్య సర్టిఫికెట్లు ఉన్నాయి.

ఎవరికైనా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి కనబడితే దయచేసి ఈ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలనీ బాధితుని కుమారుడు తలకొక్కుల ప్రసాద్ కోరుతున్నారు. ఈ బండి కనిపించినట్లయితే సెల్: 9391755352 లో సంప్రదించాలన్నారు.





