
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని తుమ్మనపల్లి గ్రామంలో గల శ్రీ శివ పంచాయతన పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయంలో శుక్రవారం అంగరంగ వైభవంగా ధ్వజస్తంభ, శిఖరయంత్ర ప్రతిష్ట, శాంతి కళ్యాణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శుక్రవారం గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షబంధనం, రుతిక్ త్వరణం, అలాగే శనివారం గోపూజ, యాగశాల ప్రవేశం, ద్వార తోరణ ధ్వజ కుంభ పూజ, అగ్ని ప్రతిష్టాపన తోపాటు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే చివరి రోజు ఆదివారం ధ్వజస్తంభ శిఖరయంత్ర ప్రతిష్ట, శాంతి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందనీ ఆలయ అర్చకుడు రాఘవాచార్యులు తెలిపారు. అదే రోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ ప్రధాన అర్చకుడు రాఘవాచార్యులు, ఆలయ నిర్వహణ కమిటీ కోరారు.

గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షబంధనం, రుతిక్ త్వరణం నిర్వహిస్తున్న వేద పండితులు..

వేడుకలకు హాజరైన గ్రామ పెద్దలు, భక్తులు..





