
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని బుడగ జంగం కాలనీలో జరుగుతున్న పలు పనుల ప్రగతిని శుక్రవారం మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య పరిశీలించారు. గత కొంతకాలంగా డ్రైనేజీలు సక్రమంగా లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నమన్న కాలనీవాసుల ఫిర్యాదు మేరకు ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల పనుల ప్రగతిని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టిపిఓ అశ్విని గాంధీ, సానిటరీ ఇన్స్పెక్టర్ బి కిరణ్, సిబ్బంది ప్రతాప రాజు, రోoటాల సుధీర్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

పనులను పరిశీలిస్తున్న కమిషనర్ సమ్మయ్య





