
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ల పై జరుగుతున్న కుట్రలను నిరసిస్తూ ఆదివారం హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…స్వాతంత్రం వచ్చిన కాలం నుండి బీసీలను అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కోసమే వాడుకున్నాయని అన్నారు. బీసీలను ఉపయోగించుకొని అగ్రవర్ణాలు తమ రాజకీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నాయని అన్నారు. బీసీలు తాము మోసపోయామని గుర్తించారని అందుకే ఐక్యంగా 42 శాతం రిజర్వేషన్లపై ముందుకు వచ్చారని పేర్కొన్నారు. రాజకీయ అవసరాల కోసం బీసీలను ఉపయోగించుకుంటున్న వారి చర్యలను బయటపెట్టడముతో బీసీల ఐక్యత పెరిగిందన్నారు. అయినా కొన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఇప్పటికీ మోసం చేస్తూనే ఉన్నాయని అన్నారు. అందుకే బీసీలు ఐక్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో కూడా బీసీలను నిలబెట్టి గెలిపించుకోవడానికి సిద్ధమయ్యారని అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం బీసీల లెక్కలను ప్రకటించిన గెట్ సక్రమంగా లేదని చాలా ప్రాంతాల్లో అతి తక్కువ శాతంలో బీసీలకు సీట్లు వచ్చాయని అన్నారు. బీసీలను రాజకీయంగా భూస్థాపితం చేయాలని అగ్రకుల పార్టీలు కుట్రలు పన్నుతున్నారని రాష్ట్రంలో రెడ్ల రాజ్యం నడుస్తుందని బీసీ జేఏసీ ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన గెజిట్ శాస్త్రీయంగా లేదని ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా నమ్మకద్రోహం అని పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 46 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 8 జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా 9వ తారీకున పార్లమెంటు ముట్టడి చేపట్టనున్నట్లు వారు తెలిపారు. బీసీ జాతీయ నాయకులు జాజూల శ్రీనివాస్ నిర్వహిస్తున్న ధర్మ యుద్ధ భేరికి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలోబీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, పట్టణ అధ్యక్షులు సంధ్యల వెంకన్న, ప్రధాన కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్, ఇప్పలపల్లి చంద్రశేఖర్, వడ్నాల ప్రభాకర్,
తాళ్లపల్లి రమేష్, అఖిలపక్షాల నాయకులు తాళ్లపళ్లి శ్రీనివాస్ గౌడ్, భీమగోని సురేష్ గౌడ్, చీకట్ల సమ్మయ్య గౌడ్, తాళ్లపళ్లి అమరేందర్ గౌడ్, పంజాల రామ్ శంకర్ గౌడ్, గోస్కుల నాగమణి మధుకర్, పంజాల వెంకటేశ్వర్లుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేస్తున్న బీసీ జేఏసీ నాయకులు…





