
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, నవంబర్ 30: కరీంనగర్ జిల్లా హుజురాబాద్
మండలంలోని పరకాల క్రాస్ సమీపం వరంగల్ రోడ్డులో గల వాసవి ఇండస్ట్రీస్ (ఎం.ఆర్.ఎం) ప్రాంగణంలో ఆదివారం మహా దివ్య పడిపూజ, స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ రైస్ మిల్లు వ్యాపారులు కాళ్ళ బసవయ్య కుమారుడు కాళ్ళ సంతోష్, అనిమ దంపతులు స్వంత ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్లూరు వెంకట్రావు, కన్నన్ దురై రాజ్ గురుస్వాముల ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సాగిన ఈ పూజ వేడుకల్లో పట్టణం, గ్రామీణ ప్రాంతాల నుంచి అయ్యప్ప మాల ధరించిన స్వాములు సుమారు 500 మంది స్వాములు, 200 మంది నాను స్వాములు పాల్గొన్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించగా ఆవరణమంతా అయ్యప్పస్వామి శరణు ఘోషతో మారు మ్రోగింది. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు, రైస్ మిల్ వ్యాపారులు, ఆడితి వ్యాపారులు, కిరాణా వర్తక సంఘం నాయకులు, వ్యాపారులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారిని ఆరాధించారు. హుజురాబాద్ శివరామకృష్ణ, రామానంద భజన మండలిల ఆధ్వర్యంలో భజన–కీర్తనలు నిర్వహించగా ఆ ప్రాంతమంతా భక్తి వాతావరణం నెలకొంది. సంతోష్ కుమార్ పదునెట్టంబడి పై పడి ముట్టించగా ఒక్కసారిగా స్వాములు లేచి స్వామియే శరణమయ్యప్ప అంటూ పెద్ద ఎత్తున కొలిచారు. అనంతరం భిక్ష, తీర్థప్రసాదాలు అందజేసి పాదాభివందనం చేసుకున్నారు. ఈ కార్యక్రమం ఈ ఏడాది హుజురాబాద్ పట్టణంలోనే మొట్టమొదటిసారిగా పెద్ద పడిపూజ నిర్వహించినట్లుగా చర్చించుకుంటున్నారు.





కాళ్ల సంతోష్ గురుస్వామి నిర్వహిస్తున్న పడిపూజ వద్ద పెద్ద ఎత్తున పాల్గొన్న అయ్యప్పస్వాములు, భక్తులు..


అయ్యప్పస్వామి ఉత్సవ విగ్రహానికి పంచామృతంలతో అభిషేకిస్తున్న సంతోష్ గురుస్వామి..




పెద్ద ఎత్తున తరలివచ్చిన అయ్యప్పస్వాములు..

నాన అయ్యప్ప స్వాములు..

అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని అలంకరించి తీసుకు వస్తున్న గురుస్వామి సంతోష్





మెట్ల పూజ చేసి పదునెట్టంబడి వెలిగిస్తున్న సంతోష్ గురుస్వామి..





