
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు వెనుకబడిన ముస్లిం వర్గాలను నాలుగు శాతం ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లను అప్పటి కీర్తిశేషులు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చొరవ తీసుకొని ముస్లింలకు ప్రభుత్వ ఉద్యోగాలలో నాలుగు శాతం రిజర్వేషన్లను కల్పించటం జరిగిందని తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆర్థికంగా అన్ని రంగాలలో వెనుకబడిన ముస్లింలను విద్య ఉద్యోగాలలో నాలుగు శాతం రిజర్వేషన్లను అమలు చేయటం జరిగిందనీ, తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఆర్థికంగా చదవలేని పరిస్థితిలో వెనుకబడి ఉన్న నిరుపేద ముస్లింలకు నాలుగు శాతం ప్రభుత్వ ఉద్యోగాలలో విద్యాలో రిజర్వేషన్లను అమలు చేసిన ఘనత అప్పటి మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డికి పేరు దక్కిందన్నారు. ఇప్పుడు కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుండి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం వర్గాలను బిసి ఈ గ్రూపులో కొనసాగుతున్న వారిని నాలుగు శాతం రిజర్వేషన్లను అమలు కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన ముస్లిం వర్గాల కు చెందిన బిసి ఈ గ్రూపులో కొనసాగుతున్న వారిని ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లను అమలు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకోవాలని తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులకు తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ సంఘం పక్షాన పత్రాలు పంపించినట్లు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు. ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇచ్చినట్లు అలాగే బీసీ ఈ గ్రూపుకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలో నాలుగు శాతం రిజర్వేషన్లు అమలైనట్లు జీవోను అమలు పరచాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు క్యాబినెట్ మంత్రులకు, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుకు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్





