
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఐసిటిసి సెంటర్లో కౌన్సిలర్ గా పనిచేస్తున్న సుజాతను ఉత్తమ కౌన్సిలర్ గా ఎంపిక చేసారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలో ఆమెకు జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఉత్తమ సేవలకు ప్రశంస పత్రం అందుకున్నట్లు ఆమె తెలిపారు.

జిల్లా వైద్యాధికారి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకుంటున్న సుజాత..





