
– గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించండి..
– అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్,అరాచకాలు కావాలంటే బిఆర్ఎస్..
– 2ఏళ్లలో ప్రతి ఇంటికి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకం.
– చేరికలతో పార్టీ క్యాడర్ లో జోష్ నింపుతున్న ప్రణవ్..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ మండలం రాజపల్లి గ్రామము నుండి అల్లుమల్ల సురేందర్ రెడ్డి, బిజెపి పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ 8మంది వార్డు సభ్యులతో కలిసి కాంగ్రెసు పార్టీలో చేరారన్నారు. వార్డు సభ్యులు
రాహుల్, విజయ, రాజకుమార్, వంశీ, తరుణ్, మధు, సునీత,
సురేష్(సమ్మయ్య) చేరిన వారిలో ఉన్నారు.
కాగా సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు దగ్గర పడుతున్న వేళ హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని, హుజూరాబాద్ అభివృద్ధి కావాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ తోనే సాధ్యమని, దాని తాలూకు ఆనవాళ్లు గత రెండేళ్లలో చూశామని, మరల అలాంటి అభివృద్ధి కావాలంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని నూతనంగా పార్టీలోకి చేరిన వారు అన్నారు. హుజూరాబాద్ మండల పరిధిలోని రాజపల్లి గ్రామం నుండి బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ప్రణవ్ ఆహ్వానించారు. రాబోయే 3 ఏళ్ల ప్రణాళికలో గ్రామాల్లో అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని,దానికి అనుగుణంగా గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతామని ప్రణవ్ అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు


అల్లుమల్ల సురేందర్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న కాంగ్రెస్ నేత ప్రణవ్…

.బిజెపి పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి 8మంది వార్డు సభ్యులతో కలిసి కాంగ్రెసు పార్టీలో చేరిన వారితో పార్టీ ఇంచార్జ్ ఓడిదల ప్రణవ్ ,కాంగ్రెస్ నాయకులు..

ప్రణవ్ బాబుకు కండువా కప్పి సత్కరిస్తున్న పార్టీలో చేరిన నాయకులు…





