Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్, డిసెంబర్,06: రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు స్థానిక భగత్ నగర్ లోని లెజెండ్ ఉన్నత పాఠశాల విద్యార్థిని శ్రేష్ట నందిని ఎంపికయ్యింది. ఈనెల 8 నుండి మూడు రోజులపాటు ఆదిలాబాద్ లో జరగనున్న 36వ సౌత్ జోన్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ పోటీలలో ఆమె పాల్గొనున్నది.
లెజెండ్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న శ్రేష్ట నందిని రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల కరస్పాండెంట్ రాజయ్య హర్షం వ్యక్తం చేశారు. పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో శ్రేష్ట నందినిని అభినందించారు. క్రీడలలో విద్యార్థులు రాణించాలని, క్రీడల ద్వారా శారీరక, మానసిక దారుఢ్యం బలపడుతుందని అన్నారు.
పాఠశాల స్థాయిలో విద్యార్థులకు వ్యాయామ ఉపాధ్యాయులచే శిక్షణ ఇప్పిస్తూ వివిధ స్థాయిలో నిర్వహింపబడేటువంటి పోటీలలో పాల్గొనేలా వారిని సిద్ధం చేస్తున్నామని తెలిపారు. క్రీడలకు సంబంధించి విద్యార్థులకు కావలసినటువంటి వనరులు కల్పించి వారిలో దాగివున్న ప్రతిభను వెలికి తీస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థినికి పుష్ప గుచ్చాలు ఇచ్చి అభినందిస్తున్న పాఠశాల కరస్పాండెంట్ రాజయ్య





