
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ఓ రైస్ మిల్ పై సివిల్ సప్లై, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేసి 320 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు. అయితే సదరు బియ్యం వ్యాపారి ఇటీవలనే రేషన్ బియ్యం అందంగా చేస్తూ పట్టుబడగా రైస్ మిల్లు సీసీ చయడంతో సమీపంలోనే ఉన్న మరో రైస్ మిల్లులో అక్రమ రేషన్ బియ్యం దందానం యదేచ్చగా కొనసాగిస్తున్నాడు. అధికారుల అండతోనే ఇదంతా జరుగుతుండగా అత్యంత సన్నిహితుల ద్వారా అందిన సమాచారం మేరకు మాత్రమే రైడ్ చేసి పెద్ద ఎత్తున రేషన్ బియ్యం పట్టుకున్నట్లు అధికారులే వెల్లడించడం కోసమేరుపు. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం బోర్నపల్లి గ్రామ శివారులోని శ్రీలక్ష్మి రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 320 క్వింటాళ్లపైన రేషన్ బియ్యాన్ని ఎన్ ఫోర్స్ మెంట్, టాస్క్ ఫోర్స్ అధికారులు వచ్చిన సమాచారం మేరకు మాత్రమే పట్టుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారంతోనే అధికారులు ఆటోలు ద్వారా తరలిస్తుండగా మెరుపు దాడి చేసి రెండు ఆటో లను సీజ్ చేశారు. వారిని నిడదీసి అడగగా రేషన్ బియ్యం దందా చేస్తున్న వ్యక్తి పేరు చెప్పడంతో మిల్లును సందర్శించి పరిశీలించడంతో ఒక్కసారిగా అక్కయ్యారు. రైస్ మిల్లులో గుట్టలు గుట్టలుగా పడి ఉన్న రేషన్ బియ్యాన్ని చూసి అధికారులు షాక్ అయ్యారు. ఇటీవలనే కరీంనగర్ రోడ్ లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం పట్టుకోగా సదరు బియ్యం వ్యాపారి మనోహర్ మళ్లీ పోగొట్టుకున్న వద్దే సంపాదించాలన్న నానుడితో దొరికిన రేషన్ బియ్యం దందానీ మళ్లీ అదేవిధంగా కొనసాగిస్తూ సంపాదించుకోవాలని చూశాడు. కానీ అతనికి గిట్టని వ్యక్తులు అధికారులకు పక్క సమాచారం ఇచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టించారు. రైస్ మిల్ వ్యాపారి ప్రభుత్వానికి గతంలోనే ధాన్యం డబ్బులు బాకీ ఉన్నట్లు తెలుస్తుంది. ఎలాగైనా ఆ డబ్బులను ఎస్కే ల రూపంలో పెట్టి తీర్చుకోవాలని ఈ విధంగా రేషన్ బియ్యం దందాకు మళ్ళీ తెర లేపినట్లుగా ప్రచారం జరుగుతుంది. కాగా సమీపంలోని రైస్ మిల్లులో ఇంతకుముందు కేసు ఎదుర్కొన్న వ్యక్తి కొన్నాళ్లు వాడుకుంటానని చెప్పి ఇలా రేషన్ బియ్యం వ్యాపారం చేస్తూ పట్టుబడడంతో సదరు మిల్లు యజమానిపై 6-ఏ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. సీజ్ చేసిన బియ్యాన్ని సివిల్ సప్లై డీఎంకు అప్పగించారు. ఈ దాడుల్లో సివిల్ సప్లై ఓఎస్డీ ప్రభాకర్, ప్రత్యేక అధికారి లక్ష్మారెడ్డి, టాస్క్ఫోర్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్, ఎస్సై జంపయ్య, ఎఫ్ఐ వినోద్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల నుండి సేకరించి తరలిస్తున్న రేషన్ బియ్యం ఆటోలను పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు..

రైస్ మిల్లులో గుట్టలు గుట్టలుగా పడి ఉన్న రేషన్ బియ్యాన్ని చూసి ఆశ్చర్యకు గురైన అధికారులు…






