Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జమ్మికుంట ఉన్నత పాఠశాల 1983- 84 బ్యాచ్ బాల్య మిత్రుల సేవాసమితి ఆదివారం రోజున 50 మంది బాల్య మిత్రులు, మిత్రురాలు కలసి హుజురాబాద్ మండలం రాంపూర్ క్రాస్ రంగాపురంలో శ్రీ సీతారామాంజనేయ పెట్రోల్ పంపు ప్రక్కన వేదిక ఏర్పాటు చేసుకొని సమితి అధ్యక్షులు మొకిరాల సంపత్ రావు బాల్య మిత్రుల సేవ సమ్మేళనాన్ని కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. బాల్య మిత్రుల సేవాసమితి ప్రతినిధులు మాట్లాడుతూ 41 సంవత్సరాల బాల్యమిత్రులు ఈ రోజున కలుసుకొని బాల్యం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. బాల్య మిత్రుల సేవాసమితి ఆధ్వర్యంలో వృద్ధాప్యలకు మానసిక వికలాంగులకు, పేదలకు ఆర్థిక సహాయం, ప్రతి సంవత్సరం లాగానే దేవస్థానం ఇల్లందకుంట బ్రహ్మోత్సవాల సందర్భంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి భక్తులకు వాటర్ సౌకర్యం కల్పించాలని కమిటీ సభ్యులు నిర్ణయించారన్నారు. బాల్య మిత్రుల సేవాసమితి కమిటీ ప్రతినిధులు ఎం. సంపత్ రావు, ఎం. వెంకటరెడ్డి, ఆర్.సంపత్ కుమార్, కె. గణపతి, ఆర్. అశోక్, శ్రీనివాస్, సునీత, అనిత తదితరులు పాల్గొన్నారు.

ఉన్నత పాఠశాల 1983- 84 బ్యాచ్ బాల్య మిత్రుల సేవాసమితి సభ్యులు..





