
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఆత్మార్పణ చేసుకున్న సాయి ఈశ్వరచారి కి కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహమ్మద్ ఖాళీద్ హుస్సేన్, ప్రజా సంఘాల నాయకులు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలో వెనుకబడిన బీసీ వర్గాలను వారి యొక్క రిజర్వేషన్లను పెంచాలని ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు క్యాబినెట్ మంత్రులు చొరవ తీసుకొని వెంటనే బీసీ కమిషన్ను నియమించి తెలంగాణ రాష్ట్ర అంతట పర్యటన చేసి వివిధ వర్గాల వద్ద నుండి అన్ని రకాల దరఖాస్తులను స్వీకరించి మరి ఎవరైనా వివిధ సంఘాల పక్షాన దరఖాస్తులు ఇవ్వవలసిన వారు ఉంటే బీసీ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ దరఖాస్తులను తీసుకోవడం జరిగింది. తర్వాత బీసీ వర్గాలలో ఉన్న ముఖ్య వ్యక్తులతో చర్చలు జరిపించి రాష్ట్రవ్యాప్తంగా డోర్ టు డోర్ ప్రజల అభిప్రాయాలను ఎంతమంది తెలంగాణ రాష్ట్రంలో ఏఏ వర్గాల వ్యక్తులు ఉన్నారని సర్వేలు జరిపించి ఆ యొక్క సర్వేల ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఆ యొక్క బిల్లును అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టి బిల్లును అందరి అభిప్రాయాలను తీసుకొని ఆమోదం పరిచి రాష్ట్ర గవర్నర్ పంపించడం జరిగిందన్నారు. దాన్ని తర్వాత న్యూఢిల్లీలో బీసీల గర్జన కార్యక్రమంలో జంతర్ మంతర్ వద్ద మన తెలంగాణ ముద్దుబిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిసి గర్జనలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలోనే బీసీల బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం పరిచి 42 శాతం వెంటనే బీసీ రిజర్వేషన్లను ఆమోదం పరచాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అనంతర జరుగుతున్న స్థానిక ఎన్నికలలో 42% రిజర్వేషన్లను అమలుపరస్తామని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పి 42 శాతం బీసీలకు రిజర్వేషన్ల కల్పిస్తూ జీవో జారీ చేశారు ఆ యొక్క జీవోపై కొంతమంది ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో ఆ జీవోను దాఖలు చేశారు. గతంలో సుప్రీంకోర్టు రిజర్వేషన్లలో 50 శాతానికి ఉంచకూడదని తీర్పు ఇచ్చిందనీ ఆ తీర్పును అనుకూలముగా తెలంగాణ హైకోర్టు బీసీ జీవోను కొట్టివేస్తూ పాత రిజర్వేషన్ల ప్రకారం బీసీ వర్గాలకు చెందిన వ్యక్తులు స్థానిక సంస్థ ఎన్నికలలో నిలబడాలని హైకోర్టు తీర్చేది తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవోపై స్టే విధించింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉందనేను ఇంత చేసిన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కావాలని కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకముగా కుట్రపూరితంగా దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఏ ప్రభుత్వం చేయనటువంటి పని మన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వర్గాల కొరకు చేయడానికి ముందుకు వచ్చిన సంగతిని ప్రక్కకు పెట్టి కొంతమంది రాజకీయంగా లాభం పొందాలని ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి బద్దులాం చేస్తున్నారు కాంగ్రెస్ తోని లాభం పొంది కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంతమంది ఇప్పుడు కావాలని విమర్శించటం వారికి తగున ఒక్కసారి ఆ వ్యక్తులు కూడా గుండె మీద చేయి పెట్టుకొని ఆలోచించాలని మిమ్మల్ని కోరుతున్నాను. సాయి ఈశ్వర్ చారి పెట్రోల్ చల్లుకొని కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం ఇలాంటి సంఘటనలు ఇక ముందు ఎవరు కూడా చేసుకోవద్దని వారందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను రాబోయే కాలంలో తప్పకుండా బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్లు తప్పక వస్తాయి కొంచెం ఓపిక పడండి తొందరపడకండి ఒక హైకోర్టులో ఈ కేసు ఉంది కనుక మనము కూడా ఆలోచించాలి అన్నారు. మనమందరము కలిసి కేంద్ర ప్రభుత్వంలో బిజెపి ప్రభుత్వం ఉంది కనుక ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కనుక అక్కడికి వెళ్లి అవసరం పడితే జంతర్ మంతర్ వద్ద టెంట్ వేసుకొని రిలే నిరాహార దీక్షలు అమర నిరాహార దీక్షలు చేపడుదాం అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి గతంలో సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇలా ప్రకటించారు అలాగనే ఇప్పుడు బిసి ఉద్యమం ద్వారా జంతర్ మంతర్ న్యూఢిల్లీలో ధర్నాలు రిలే నిరాహార దీక్షలు అమర నిరాహార దీక్షలు చేపడుదాం అందరం ఒకటై కదులుదాం బీసీ రిజర్వేషన్ల కొరకు మనమందరం వెనుకబడిన దళిత గిరిజన మైనార్టీ వర్గాల తరఫున అందరము ఒకటై పోరాటం చేద్దాం మన హక్కుల్ని మనం సాధించుకుందాం.
బీసీ. ఎస్సీ. ఎస్టి. మైనార్టీ. ఐక్యత వర్ధిల్లాలి బీసీ.ఎస్సీ. ఎస్టి. మైనార్టీ. సోదరులందరూ ఒకటిగా పోరాటం చేద్దాం. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈఓ గొట్టే జమదగ్ని
రిటైర్డ్ గెజిటెడ్ హెడ్మాస్టర్, జేఏసీ కన్వీనర్ వేల్పుల రత్నం, srimatha పూలే జయంతి కమిటీ మాజీ అధ్యక్షులు ఉప్పు శ్రీనివాస్, సోషల్ మీడియా కన్వీనర్తు, thulasi లసి లక్షణామూర్తి
రిటైర్డ్ ఆర్టిసి ఎడిసి మల్లయ్య, షేక్ అజ్జు, కిరణ్, గోపి, కుమార్, తాసీఫ్, ముఖిద్, షంషీర్, వేల్పుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

కొవ్వొత్తులతో నివాళులర్పిస్తున్న నాయకులు..





