
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్డులో ఈ నెల 21 ఆదివారం రోజున భారతదేశ దివంగత మాజీ ప్రదాని పీవీ నరసింహారావు విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ రూపొందించిన వాల్ పోస్టర్లను శుక్రవారం పివి సేవాసమితి, అలయన్స్ క్లబ్ ప్రతినిధులు బల్దియా కమిషనర్ కేంసారపు సమ్మయ్య చేతుల మీదుగా పోస్టర్
విడుదల చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు పివి కుమారుడు పీవీ ప్రభాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహన్నీ ఆవిష్కరీస్తారని పీవీ సేవాసమితి అధ్యక్షుడు తూము వెంకటరెడ్డి తెలిపారు. తదనంతరం స్థానిక హుజురాబాద్ క్లబ్ లో సమావేశం ఉంటుందని వారు తెలిపారు. విగ్రహ ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించిన దాతలకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఉంటుందని వెంకటరెడ్డి తెలిపారు. పీవీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనగలరని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో కమీషనర్ సమ్మయ్యతో పాటు బి.మనోజ్.
నాయకులు చిలుకమారి శ్రీనివాస్, జి జైపాల్ రెడ్డి, చందుపట్ల జనార్ధన్, టి మాధవరావ్, సీడ్స్ సంపత్ రావు, సందేల వెంకన్న, పశుల స్వామి, మాజీ సర్పంచ్ పంజాల సుధాకర్, విశ్రాంత ఉపాధ్యాయులు కె.సదానందం, ఇప్పకాయల సాగర్, చిలుక మారి శ్రీనివాస్, సుభాష్, ఏం వెంగళరావు తదితరులు పాల్గొన్నారు.


పీవీ విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ ను ఆవిష్కరిస్తున్న పీవీ సేవా సమితి నాయకులు, అభిమానులు, వివిధ సంఘాల నాయకులు..





