
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో నిర్వహిస్తున్న పవిత్ర ధనుర్మాస ఉత్సవాల సందర్భముగా, ధనుర్మాస 2025–2026 తెలంగాణ పర్యటనలో భాగంగా, వికాస తరంగిణి – హుజురాబాద్ శాఖ ఆధ్వర్యంలో,
ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి వారు తేదీ: 23-12-2025 (మంగళవారం) నాడు హుజురాబాద్ పట్టణానికి విచ్చేస్తున్నారు.
స్వామి వారు మంగళవారం రాత్రి హుజురాబాద్లో బస చేసి,
బుధవారం (24/12/2025) ఉదయం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో జరుగనున్న ధనుర్మాస ఉత్సవాలలో పాల్గొని భక్తులతో ఉదయం 9:00 గంటలకు కుంకుమ అర్చన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈ పవిత్ర ధార్మిక కార్యక్రమంలో భాగంగా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని, స్వామివారిస్వామివారి దివ్య అనుగ్రహ భాషనములు మరియు దివ్యమంగళ శాసనములు పొందవలసిందిగా ఆలయ కమిటీ మరియు వికాస తరంగిణి ప్రతినిధులు కోరుచున్నారు. కుంకుమ అర్చనలో పాల్గొనదలచిన భక్తులు రూ. 300/- చెల్లించి తమ పేర్లను ముందుగా ఆలయంలో నమోదు చేసుకోవలసిందిగా కోరారు.
ఈ విశేష ధార్మిక కార్యక్రమాన్ని భక్తుల సహకారంతో ఘనంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.

రామానుజ జీయర్ స్వామీజీ..





