
కనుకులగిద్ద గ్రామంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచి ములుగు సంధ్యారాణి సంపత్, ఉప సర్పంచ్ జాలి బలరాంరెడ్డి, వార్డ్ నెంబర్లు మోడపు వినయ్ తదితరులు ప్రమాణ స్వీకారామ్ సందర్భంగా కంకణాల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడం జరిగింది. అలాగే జాలి రాంరెడ్డి, బోయిని కొండల్, లింగాల జనార్దన్ రెడ్డి, మోడపు విజ్ఞాన్, గోపూ గోపిరెడ్డి ఎనూరి వినోద్, ఓరుగంటి సాయి, గోపూ అజయ్ రెడ్డి తదితరులు పాల్గొని నూతన సర్పంచి, కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ప్రజల ఆకాంక్షల కనుగుణంగా, అందరికి నచ్చే విధంగా గ్రామ పాలన అందించాలని ఈ సందర్భంగా నూతన పాలకవర్గానికి సూచించారు.


సర్పంచి దంపతులకు జ్ఞాపికలు అందజేసి శాలువా కప్పి సత్కరిస్తున్న కంకణాల రవీందర్ రెడ్డి

ఉప సర్పంచ్ కు పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువా కప్పి సత్కరిస్తున్న కంకణాల రవీందర్ రెడ్డి…

నూతన వార్డు సభ్యుడుగా ఎంపికైన మోడపు విజ్ఞాన్ ను సత్కరిస్తున్న రవీందర్ రెడ్డి తదితరులు..





