
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ హుజురాబాద్ మండల అధ్యక్షులు కంకణాల రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హత్యాకాండ, ఇటీవల దీపు చంద్రదాస్ కిరాతక హత్యను ఖండిస్తూ.. మతోన్మాద జీహాదీ గుండాలకు వ్యతిరేకంగా.. హుజురాబాద్ లోని అంబెద్కర్ చౌరస్త వద్ద బంగ్లాదేశ్ ఉగ్రముకల దిష్టి బొమ్మ దగ్ధం మరియు నిరసన కార్యక్రమం నిర్వహించారు. హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరించే ఏలాంటి ఉగ్రవాదులునైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆయా దేశాల్లో హిందువులపై జరుగుతున్న దాడులను తక్షణమే ఆపాలని, లేకపోతే భారత ప్రభుత్వం సైనిక చర్య చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా vhp జిల్లా కార్యదర్శి ఆదిముల విద్యాసాగర్ రావు, గోరక్ష ప్రముఖ అనిల్, బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పైళ్ల వెంకట్ రెడ్డి, నాయకులు గంగిశెట్టి రాజు, కందుల శ్రీనివాస్ రెడ్డి, వివిధ క్షేత్ర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.








