
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బహుజనులు విజయం సాధించడం ప్రజల్లో వస్తున్న మార్పుకు నాంది అని మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య అన్నారు. సోమవారం హుజూరాబాద్ పట్టణంలోని హుజురాబాద్ క్లబ్ లో పంచాయతీ ఎన్నికల్లో మండలంలో గెలిచిన సర్పంచ్లకు ఉప సర్పంచులకు బిసి ప్రజాస్వామిక ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ తిరుపతయ్య మాట్లాడుతూ… అనాదిగా సమాజంలో రిజర్వేషన్లలో మాత్రమే బీసీలు ఎస్సీలు ఎస్టీలు పోటీ చేయాలనే ఆలోచన ఉండేదని దాన్ని మార్చివేసి ఈసారి పంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బహుజనులు విజయం సాధించారని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం బీసీ ఉద్యమం బాగా ఊపొందుతుందని ఈ నేపథ్యంలో ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు కల్పించకపోవడం వల్ల చాలామందికి అవకాశాలు రాలేదని అన్నారు. కానీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జనరల్ స్థానాల్లో పోటీ చేయడానికి బహుజనులు ముందుకు రావడం శుభ పరిణామం అన్నారు. హుజురాబాద్ మండలంలో 20 స్థానాలకు గాను 15 స్థానాలు బహుజనులు విజయం సాధించడం అభినందనీయమన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వం తప్పనిసరిగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. న్యాయవాది ముక్కెర రాజ మాట్లాడుతూ… జనరల్ స్థానాల్లో విజయం సాధించిన అభ్యర్థులు తమ పరిపాలన సామర్థ్యం ద్వారా ప్రజల మన్నలను పొందాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ…. జనరల్ స్థానాల్లో విజయం సాధించిన బహుజనులు అభినందనీయులని, వారి తెగులు చూసి త్వరలో జరిగే ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో ఎక్కువ శాతం బహుజనులు పోటీకి ముందుకు రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇటీవల విజయం సాధించిన సర్పంచ్ ఉప సర్పంచ్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిసి ప్రజాస్వామిక ఉద్యమ వేదిక కన్వీనర్ సాదుల రవీందర్ బాబు, భీమోజు సదానందం, పొడిశెట్టి వెంకట్రాజం, గాలిబు అమరేందర్, వనజ పటేల్, వేల్పుల రత్నం, ఖాళీదు హుస్సేన్, ప్రశాంత్ గౌడ్, రామంచ భరత్, పాక సతీష్, వేల్పుల ప్రభాకర్, రామ్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

సర్పంచులను సన్మానిస్తున్న అతిథులు..

సన్మానం పొందిన మండలంలోని బహుజన సర్పంచులు..





