Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అతి తక్కువ వడ్డీరేట్లతో బంగారు నగలపై 95 శాతానికి పైగా ఋణాన్ని అందజేయనున్నట్లు క్యాప్రి గ్లోబల్ గోల్డ్ లోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రాంచ్ ను హుజూరాబాద్ బ్రాంచ్ మేనేజర్ మొలుగూరి సుమన్ అధ్యక్షతన మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ గందె రాధిక సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద పండితులు తిరుమలాచార్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా బ్రాంచిలో సేవలను బ్రాంచ్ మేనేజర్ సుమన్ అందుబాటులోకి తెచ్చారు. నూతన ఖాతాలను తెరిచారు. ఆయన వెంట సహాయ మేనేజర్ అజయ్, రిలేషన్షిప్ మేనేజర్ పవన్ కళ్యాణ్, ఏరియా మేనేజర్ షేక్ సల్మాన్, క్యాప్రి గ్లోబల్ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

హుజూరాబాద్ లో క్యాప్రి గ్లోబల్ గోల్డ్ లోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రాంచ్ ను ప్రారంభిస్తున్న తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక





