
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: హుజూరాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో గురువారం సద్గురు వేద భారతి విద్యాపీఠం ఆధ్వర్యంలో విద్యార్థులకు భగవద్గీత పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో హుజురాబాద్ తాసిల్దార్ జక్కని నరేందర్ మాట్లాడుతూ.. భగవద్గీత సకల వేదాల సారమని, భగవంతుని గుణం ప్రభావాలను వివరిస్తుందని ఇది నిరూపమాన గ్రంథం అని అన్నారు. మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య మాట్లాడుతూ… జ్ఞానం ద్వారా పిల్లల అభివృద్ధి చెందుతారని సనాతన ధర్మం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని అన్నారు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన భగవద్గీత కేవలం ఒక మతానికి సంబంధించింది కాదని విశ్వ మానవ కళ్యాణానికి దోహదం చేస్తుందన్నారు. ఎంఈఓ బి శ్రీనివాస్ మాట్లాడుతూ…జీవితంలో మనిషి తాను సాధించడానికి ఏం చేయాలో ఎలా కష్టపడాలో ధైర్యంగా ఆలోచనపరంగా ఎలా ఉండాలో భగవద్గీత వివరిస్తుందన్నారు .వేద భారతి ట్రస్ట్ ఫౌండర్ కూర్మాచలం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… ప్రజల్లో నైతికత, కర్తవ్యం పట్ల బాధ్యత పెంపొందిస్తుందన్నారు. కృష్ణుడు గీతలో చెప్పినట్లుగా మనిషి తనకు చేతనైన జ్ఞానాన్ని గాని సహాయాన్ని గాని ఇతరులకు చేయాలని సూచించాడని దానికి అనుగుణంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ గ్రామ సర్పంచ్ కాలువల సంపత్ ఉపసర్పంచ్ నారాయణరెడ్డి, తుమ్మనపల్లి సర్పంచ్ రవీందర్ రెడ్డి ట్రస్ట్ చైర్మన్ రావు కార్యదర్శి కోలా రామచంద్రారెడ్డి సమ్మిరెడ్డి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న తహసిల్దార్ నరేందర్..

భగవద్గీత పుస్తకాలతో విద్యార్థులు..





