
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ మండలములోని రంగాపూర్ కల్వరి టెంపుల్ లో Rev. Dr. P. R నెల్సన్ ఆద్వర్యంలో నూతన సంవత్సర ఆరాధన మరియు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ప్రత్యేక వాక్యసందేశం అందించడానికి గుంటూరు నుండి Rev. Dr. చెల్లీ అశోక్ కుమార్ హాజరై స్తుతి ఆరాధన మరియు ప్రత్యేక సందేశం అందించారు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం గణాంకాల ద్వారానే ఈ నూతన సంవత్సరమును, ఈ క్యాలెండర్సు ఏర్పాటు చేశారు. కాబట్టి క్రీస్తు పుట్టుక మరియు ఆయన చేసిన సేవలు ప్రపంచానికి ఎంతో దోహదపడ్డాయని, ఆయన చూపిన మార్గం ప్రపంచ శాంతికి ఎంతో దారి చూపిందని బోధించారు. చర్చ్ ఫాదర్ హాజరైన ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర బైబిల్ వాగ్దానాలను అందచేసి అందరికీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నూతన సంవత్సరము కాబట్టి సంఘ క్వయర్ ప్రత్యేక పాటలు పిల్లల నాట్యాలు, యూత్ స్కిట్స్ క్రైస్తవులతో పాటు హాజరైన ప్రజలను ఆ కట్టుకున్నారు. పంచాయతీ సెక్రెటరీ బండ ప్రసాద్ చర్చ్ సభ్యులలో పేదవారికి అందించిన చీరలను అతిధులైన రెవ. డా. అశోక్ కుమార్ పంపిణీ చేశారు. అనంతరం హాజరైన అతిథులతో ఫాదర్ నెల్సన్ దంపతులు కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం చర్చ్ ఫాదర్ క్యాలెండర్స్ ను అతిధులైన అశోక్ కుమార్, సంఘ సభ్యులందరూ ఆవిష్కరించి వేడుకలను ముగించారు.

గుంటూరు నుండి వచ్చిన Rev. Dr. చెల్లీ అశోక్ కుమార్ స్తుతి ఆరాధన మరియు ప్రత్యేక సందేశం అందిస్తున్న దృశ్యం.

ప్రత్యేక సందేశమిస్తున్న Rev. Dr. P. R నెల్సన్


క్యాలెండర్స్ ని ఆవిష్కరిస్తున్న అతిథులు..


ప్రత్యేకంగా తయారుచేసిన కేక్ ని కట్ చేస్తున్న అతిథులు…

ముఖ్య అతిథికి కేక్ కట్ చేసి తినిపిస్తున్న పాస్టర్ రెవరెండ్ నెల్సన్..

నెల్సన్ పాస్టర్కు కేక్ తినిపిస్తున్న ముఖ్య అతిథి…

నిరుపేదలకు చీరలు పంపిణీ చేస్తున్న ముఖ్య అతిథులు..


ప్రత్యేక గీతాలు ఆలపిస్తున్న సంఘ సభ్యులు…





