
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు సందర్భంగా ప్రతి ఒక్కరూ రహదారి భద్రతపై కనీస అవగాహన కలిగి ఉండాలని హుజురాబాద్ వాహనముల తనిఖీ అధికారి కంచి వేణు పేర్కొన్నారు. ఈరోజు స్థానిక ప్రభుత్వ పాఠశాల మైదాన ఆవరణంలో బస్సులో తనిఖీలో భాగంగా స్కూల్ బస్సులన్నింటికీ తనిఖీ నిర్వహించారు. అనంతరం డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ వేణు మాట్లాడుతూ విద్యాసంస్థల బస్సులను పరిశీలించి బస్సుల కండీషన్‌తో పాటు బస్సు పత్రాలు, డ్రైవర్ సామర్థ్యం అన్ని సరిగ్గా చూసుకోవాలని సూచిస్తున్నారు. విద్యాసంస్థలకు చెందిన బస్సులను నిబంధనలకు అనుగుణంగా నడిపించాలి. ఈ నిబంధనలు తప్పనిసరి.
మోటారు వాహన చట్టం ప్రకారం రిజిస్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్, పర్మిట్, పన్ను చెల్లింపు రసీదు, పొల్యూషన్ అండ్ కంట్రోల్ సర్టిఫికెట్తో పాటు డ్రైవర్లకు లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. డ్రైవర్ ఫొటోను తప్పనిసరిగా బస్సులో ఏర్పాటు చేయాలి. డ్రైవర్‌కు ఐదేండ్ల అనుభవం ఉండాలి. 60 ఏండ్ల వయసు మించకుండా చూసుకోవాలి. తప్పక కంటి పరీక్షలు జరిపించాలి. ప్రతి మూడు నెలలకోసారి వైద్యపరీక్షలు చేయించాలి.డ్రైవర్ లైసెన్స్‌ను స్కూల్ యాజమాన్యం తప్పక తనిఖీ చేయాలి. బస్సు నిర్వహణపై రిజిస్ట్రర్ ఏర్పాటు చేయాలి.డ్రైవర్ వద్ద ఫిర్యాదు పుస్తకం ఉండేలా పాఠశాల యాజమాన్యం చర్యలు తీసుకోవాలి.బస్సుల్లో అత్యవసర ద్వారాలు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, సైడ్ అద్దాలు ఉండేలా చూసుకోవాలి.పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించరాదు. బస్సుకు సంబంధించి బ్యాటరీ, వైపర్స్, రెండువైపులా ఇండికేటర్లు పని చేసేలా చూసుకోవాలి. బస్సులకు తప్పక పసుపు రంగు వేయాలి.డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మోటార్ వాహనాలు నడపడం మరియు సెల్ ఫోన్ తో మాట్లాడుతూ నడపకూడదని తెలియజేశారు. వాహనము మలుపు తిరుగు తున్నప్పుడు నిలుపు ఉన్నప్పుడు చేతితో సరైన సంకేతాలు ఇవ్వాలి. ముందు వెళ్లే వాహన డ్రైవరు ఇవ్వనిచో వాహనము దాటుటకు ప్రయత్నించకండి. కదులుతున్న వానని ఎక్కడం కానీ దిగడం కానీ చేయకూడదు. రాత్రి సమయంలో ఎదురుగా వాహనములు వచ్చినప్పుడు హెడ్‌లైట్ డిమ్ చేయాలి. ఇరుకు వంతెన వద్ద ట్రాఫిక్ ను గమనించి సహనముతో దాటాలి. క్షేమంగా చేరుటకు ఏకైక మార్గం. తడిగా ఉన్న ఆయిల్ ఉన్న ఇసుక దుమ్ము బురద రోడ్డుపై వేగంగా వెళ్ళుట ప్రమాదకరం. రోడ్డు నిబంధనలు సూచనలకు డ్రైవర్లకే కాదు కుండా పాదాచారుల కూడా వర్తింపచేస్తాయి. పాదాచార్యులు రోడ్డుకు ఇరువైపులా చూసి వాహనము రానప్పుడు జీబ్రా లైన్లో వద్దనే రోడ్డును దాటాలి. నిర్ధారిత స్థలంలో మాత్రమే వాహనాన్ని పార్కింగ్ చెయ్యాలి.మార్గం రాత్రి వేళలో వాహనాన్ని నిలిపించినప్పుడు పార్కింగ్ లేటు తప్పనిసరిగా వెయ్యాలి. పరిమితిని మించి విద్యార్థులు విద్యార్థులను బస్సుల్లో అనుమతించరాదు. బస్సు సరైన కండిషన్లో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని విద్యార్థులకు ప్రయాణానికి ఉపయోగించాలి. మంచి నైపుణ్యం గల డ్రైవర్‌ను మాత్రమే స్కూల్ బస్సు నడపడానికి విధుల్లోకి తీసుకోవాలని యాజమాన్యానికి తెలియజేశారు. అనంతరం డ్రైవర్లతో రోడ్ భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ట్రస్మా అధ్యక్షులు వి వెంకటేశ్వర్, జిల్లా ట్రస్మా నాయకులు కోరం సంజీవరెడ్డి, హుజురాబాద్ పాఠశాలల ప్రిన్సిపల్స్ రవీందర్, పి కిరణ్, కోటి, రవాణా శాఖ సిబ్బంది ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ నాగరాజు, హోంగార్డ్ బుర్ర సురేష్, బస్సు డ్రైవర్లు, క్లీనర్లు పాల్గొన్నారు.

డ్రైవర్లతో రోడ్ భద్రతపై ప్రతిజ్ఞ చేయిస్తున్న మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచి వేణు


మాట్లాడుతున్న మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ వేణు






