
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజూరాబాద్: హుజూరాబాద్ పట్టణంలో ని వరంగల్ రోడ్ లో గల వివేకానంద విగ్రహం వద్ద, లైబ్రరీలో చిత్రపటానికి పూలమాలలు వేసి బిసి ఆజాది ఫెడరేషన్, ఏబీవీపీ, విద్యావంతులు వేర్వేరుగా జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలను ఉన్నత శిఖరాలకు ఉండే విధంగా తీర్చిదిద్దిన మేధావి వివేకానందుడని, ఆ మహనీయుని సేవలు స్ఫూర్తిదాయకమని పలువురు అభిప్రాయపడ్డారు. కాగా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా(2012) నుండి నేటి వరకు 15 సంవత్సరాలుగా నిరాటంకంగా స్వామికి సామాజిక కార్యకర్త కోటోజు జ్యోతిరాణి దండ వేసి నివాళులర్పిస్తున్నట్లు ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీసీ ఆజాదీ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు చిలుక మారి శ్రీనివాస్, సబ్బని రాజేందర్, శ్రీనివాస్, జీవన్, ఆర్. శ్రీనివాస్,
ఏబీవీపీ రాష్ట్ర ఎస్ ఎఫ్ డి కో కన్వీనర్ గోస్కుల అజయ్, నగర సంయుక్త కార్యదర్శి సిద్దు, రాంచరణ్, అఖిల్, రతుల్ భార్గవ్ అబ్బో, మారుతి ,విజయ్
***లైబ్రరీలో.. తిరునగరి రమేష్, జగదీశ్వర్, సూర్యనారాయణ, వెంకట సత్యనారాయణ శేఖర్, మునీందర్ శ్రీనివాస్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


ఏబీవీపీ రాష్ట్ర ఎస్ ఎఫ్ డి కో కన్వీనర్ గోస్కుల అజయ్, నగర సంయుక్త కార్యదర్శి సిద్దు తదితరులు


సామాజిక కార్యకర్త కోటోజు జ్యోతిరాణి దండ వేసి నివాళులర్పిస్తున్న దృశ్యం





