Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజూరాబాద్: త్వరలో జరగనున్న హుజురాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల కోసం రూపొందించిన ఓటర్ల తుది జాబితాను శుక్రవారం విడుదల చేసినట్లు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య అన్నారు. ఆయన మాట్లాడుతూ…మున్సిపల్ 2వ సాధారణ ఎన్నికలు-2026 పురస్కరించుకొని ఎన్నికల సంఘం సూచనల మేరకు వివిధ దరఖాస్తులు అనంతరం మార్పులు చేర్పుల తర్వాత తుది జాబితాను, పోలింగ్ బూతుల వివరాలను ప్రకటించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ మేనేజర్ ఆర్ భూపాల్ రెడ్డి , టిపిఓ అభినవ్, టిపిఎస్. ఎన్ అశ్వినీగాంధీ, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

హుజురాబాద్ మున్సిపల్ తుది జాబితా విడుదల చేస్తున్న కమిషనర్ సమ్మయ్య, సిబ్బంది





