
– సీనియర్, జూనియర్ న్యాయమూర్తుల చేతుల మీదుగా కార్యక్రమాలకు శ్రీకారం
– న్యాయవాదుల ఐక్యతకు, స్నేహపూర్వక వాతావరణానికి ఇవి దోహదం : న్యాయమూర్తులు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో 26 జనవరి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయవాదుల కోసం ఏర్పాటు చేసిన క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలను హుజురాబాద్ సీనియర్ సివిల్ జడ్జి పిబి కిరణ్ కుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పద్మసాయి శ్రీ, 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి వీణ ప్రణతిలు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ,
“ఇలాంటి క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు న్యాయవాదులు, న్యాయస్థాన సిబ్బంది మధ్య ఐక్యతను, స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందిస్తాయి. న్యాయవృత్తిలో ఉండే ఒత్తిడిని తగ్గించడంలో ఇవి ఎంతో ఉపకరిస్తాయి” అని పేర్కొన్నారు. క్రీడా కార్యక్రమాల ద్వారా న్యాయవాదుల్లో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం పెరుగుతుందని, అలాగే రోజువారీ న్యాయవృత్తిలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించేందుకు ఇవి ఉపయోగపడతాయని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. జూనియర్, సీనియర్ న్యాయవాదులు ఉత్సాహంగా పాల్గొనడం హర్షణీయమని తెలిపారు. హుజురాబాద్ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు యతిపతి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, ఈ క్రీడల్లో పాల్గొని విజయం సాధించిన వారికి 26 జనవరి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బహుమతులు అందజేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షులు యతిపతి అరుణ్ కుమార్, జనరల్ సెక్రటరీ యెర్రొళ్ల రమేష్, ప్రభుత్వ న్యాయవాది గుర్రం శ్రీనివాస్, సీనియర్ అడ్వకేట్ ముక్కెర రాజు, న్యాయవాదులు శిరీష, శివరామకృష్ణ, గుర్రాల వెంకటకుమార్, కళ్యాణ్, మౌనిక, ఎన్ రాజు, ఆర్ అనిల్, హరిహరన్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. హుజురాబాద్ న్యాయవాదుల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమాలు న్యాయవాదుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని పలువురు అభిప్రాయపడ్డారు.


క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ






