
–పాల్గొన్న కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్
మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ పట్టణంలోని స్థానిక ఏటీవో కార్యాలయము ఆవరణలో శుక్రవారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్( టాప్రా) హుజూరాబాద్ శాఖ అధ్యక్షుడు భారత ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏటీవో తోట సోనియా ఎస్ టిఓ పత్యం శివరామకృష్ణ, టాప్ర డైరీ మరియు కేలండర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా టాప్ర కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ టాప్ర డైరీ మరియు క్యాలెండర్ ను ఆవిష్కరింపజేసిన హుజురాబాద్ యూనిట్ ను అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో పెన్షనర్ల సమస్యల కొరకు ధర్నాలు, నిరసనలు, రిలే నిరాహార దీక్ష రూపములో నిరంతర పోరాటం చేస్తూ సమస్యల పరిష్కారంలో టా ప్ర ప్రధాన భూమికను పోషిస్తున్నదని తెలియజేయడానికి గర్వంగా ఉందన్నారు. మార్చి 2024 నుండి పదవి విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించడంలో తాత్సారం చేస్తూ పెన్షనర్లను మనోవేదనకు గురి చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ చర్యను గర్హిస్తూ పెన్షనర్లు అందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనియెడల పెన్షనర్ల అందరికీ పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లించేంతవరకు టా ప్ర రాష్ట్ర శాఖ ఆదేశానుసారము తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టా ప్ర హుజురాబాద్ యూనిట్ ప్రధాన కార్యదర్శి చీకట్ల సమ్మయ్య, కోశాధికారి మండల వీరస్వామి, ఉపాధ్యక్షులు తాటిపాముల కనుకయ్య, గౌరీశెట్టి సాంబయ్య, బొంగోని వెంకటయ్య, బీసీ జేఏసీ నాయకులు సందేల వెంకన్న, ఇప్పకాయల సాగర్, పల్లె సతీష్ గౌడ్, మహమ్మద్ ఖలీద్ హుస్సేన్, సురేష్, టా ప్ర బాధ్యులు దొంత హరికిషన్, చొల్లేటి మల్లారెడ్డి, పెద్దపేట రమేష్, గూడూరి స్వామిరెడ్డి, గాజర్ల బుచ్చిరాజం, తౌటం సంపత్ కుమార్, పి సత్యనారాయణ, చాడ సమ్మిరెడ్డి, కే రాజిరెడ్డి, మంతెన సుదర్శన్, కందుల ఆదిరెడ్డి, లింగయ్య, గరవేన శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.






