Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ టీచర్స్ యూనియన్ హుజురాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు హుజురాబాద్ మండల విద్యా వనరుల కేంద్రం వద్ద టిటియు 2026 క్యాలెండర్ ను హుజురాబాద్ మండల విద్యాధికారి భూపతి శ్రీనివాస్ చేతుల మీదగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించుటలో టిటియు సంఘము కృషి చేస్తుందని తెలుపుతూ, పదవ తరగతి ఫలితాల్లో హుజురాబాద్ మండలాన్ని జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో ఉండే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని , మండల పరిషత్ పాఠశాలలో ఎఫ్ ఎల్ ఎస్ కార్యక్రమములో విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలపై దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి పోలంపల్లి ఆదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు అన్నింటిని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ అయిన ఉపాధ్యాయుల యొక్క అన్ని రకాల బిల్లులను వెంటనే చెల్లించాలని, ఉద్యోగులందరికీ పిఆర్సి50 శాతం ఫిట్మెoటుతో అమలు చేయాలని కోరారు. ఉపాధ్యాయుల, ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, పెండింగ్లో ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు, జిపిఎఫ్ లోన్లు, టీఎస్ జిఎల్ఐ లోన్లు వెంటనే క్లియర్ చేయాలని, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సమ్మిరెడ్డి, శోభారాణి, టిటియు రాష్ట్ర గౌరవ సలహాదారులు డాక్టర్ ఏరుకొండ నరసింహస్వామి, హుజురాబాద్ మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దానంపల్లి శ్రీనివాస్, మోర రాజేందర్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు తాళ్ల తిరుపతి, రావుల రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు పట్టమ్ శ్రీనివాస్, నిమ్మల కొండాల్ రెడ్డి, హుజురాబాద్ డివిజన్ సలహాదారులు పొద్దుటూరి కిషన్ రెడ్డి కార్యవర్గ సభ్యులు మరియు ఉపాధ్యాయులు ప్రదీప్ రెడ్డి, దేవోజు నాగరాజు, వేణుగోపాల్, గోపి, రాజయ్య, నాగరాజు, రాజేంద్రప్రసాద్, రాధ, రజని, మాధవి, గోపాల్ రెడ్డి, సిఆర్పిలు రవిబాబు, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టిటియు 2026 క్యాలెండర్ ను ఆవిష్కరీస్తున్న రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు…





