
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఓసిల డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఓసి జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వచ్చే నెల ఫిబ్రవరి 27న వేలాది మందితో డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించ తలపెట్టిన జాతీయస్థాయి ఓసిల మహాధర్నాను కేంద్ర ప్రభుత్వ అధికారుల సూచన మేరకు అనివార్య కారణాల వల్ల ముందుగా నిర్ణయించిన ఫిబ్రవరి 27న కాకుండా ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహిస్తున్నామని ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు శుక్రవారం హోటల్ శ్రీనివాస్ కాన్ఫరెన్స్ హాల్ లో మీడియాతో మాట్లాడుతూ పోలాడి రామారావు వెల్లడించారు.

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పటిష్టంగా అమలుకు, ఓసిల స్థితి గతుల అధ్యయనానికి చట్టబద్ధతగల ప్రత్యేక జాతీయస్థాయి ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలని ఈడబ్ల్యూఎస్ అర్హతకు వార్షికాదాయ పరిమితిని 10 లక్షలకు పెంచాలని, 50 శాతం దాటకుండా ఉన్న రిజర్వేషన్లలో ఓసిలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలనే ప్రథాన డిమాండ్లతో ఫిబ్రవరి 23న డిల్లిలో జంతర్ మంతర్ వద్ద జాతీయస్థాయిలో ఓసి జేఏసీ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల ఓసి ఐకాస సంఘాలను కలుపుకొని ఐక్యంగా నిర్వహించ తలపెట్టిన ఓసిల మహాధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓసి సామాజిక వర్గీయులు పార్టీలకతీతంగా తరలి రావాలని పోలాడి రామారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓసి ఐకాస నాయకులు జున్నూతుల రాజిరెడ్డి, గూడూరి స్వామిరెడ్డి, దడిగేల వెంకటేశ్వర్ రావు, తోపు చర్ల శ్రీనివాస్, రాజమడుగు నరసింహా రావు, ఉమ్మడి జిల్లా ఆర్య వైశ్య మాజీ అధ్యక్షుడు తాటీపెళ్లి రాజన్న నాయకులు పాల్గొన్నారు.

ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహించనున్న ఢిల్లీ మహాధర్నా ఆహ్వాన పత్రిక ఆవిష్కరిస్తున్న ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..






