
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: వాహనాలను నడిపేటప్పుడు వాహనదారులు చేసే చిన్న పొరపాటుతో ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని హుజురాబాద్ ఆర్డిఓ రమేష్ బాబు అన్నారు. శుక్రవారం హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాల గురించి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. రోడ్డు భద్రత నియమాల ను పాటిస్తూ సురక్షితమైన ప్రయాణాన్ని చేయాలని అన్నారు. ప్రయాణం చేసేటప్పుడు సీట్ బెల్ట్ గాని హెల్మెట్ గాని ధరించకపోవడం వల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అందువల్ల ప్రతి ఒక్కరూ మన ప్రాణ రక్షణ కోసం రోడ్డు భద్రత నియమాలను పాటించాలన్నారు. అనంతరం హుజురాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి మాట్లాడుతూ… యువకులు వాహనాలు నడిపే సమయంలో ఏకాగ్రతతో ఉండాలని సెల్ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రాణాపాయం కలుగుతుందని అన్నారు. రోడ్డు భద్రత నియమాలు తెలుసుకోవడమే కాకుండా పాటించడం కూడా అవసరమని లేని పక్షంలో కేసులు అవుతాయని అన్నారు. తప్పనిసరిగా వాహనం నడిపేవారు డ్రైవింగ్ లైసెన్సు ఇన్సూరెన్స్ తదితర కలిగి ఉండాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబాలకు కుటుంబాలు నష్టపోయిన సంఘటనలు మనం అనేకం చూస్తున్నామని అందువల్ల యువత తప్పనిసరిగా భద్రత నియమాలు పాటించి సురక్షిత ప్రయాణం చేయాలన్నారు. ఈ సందర్భంగా సురక్షిత ప్రయాణం రోడ్డు భద్రత నియమాలపై విద్యార్థులకు స్క్రీన్ పై ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ టౌన్ సిఐ టీ కరుణాకర్, మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య , కళాశాల ప్రిన్సిపాల్ వి ఆంజనేయరావు, రూరల్ సీఐ పులి వెంకట్ గౌడ్, జమ్మికుంట సిఐలు రామకృష్ణ గౌడ్, లక్ష్మీనారాయణ, ఎస్సైలు స్వాతి, తిరుపతి, వివేక్ లతో పాటు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లారీ అసోసియేషన్ అధ్యక్షులు రాజయ్య ,కార్యవర్గాన్ని సిఐ సన్మానించారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఆర్డీవో రమేష్ బాబు, పక్కన ఏసిపి మాధవి, ప్రిన్సిపల్, సిఐలు ఎస్ఐలు..

ప్రభుత్వ కళాశాలలో చదివి సక్సెస్ చదివించి ఉన్నత స్థానం ఉద్యోగంలో ఉన్న పూర్వ విద్యార్థుల ఫ్లెక్సీని ఆవిష్కరించిన ఆర్డీవో, ఏసీపీ, సీఐలు, ఎస్సైలు తదితరులు..






